విజయవాడ

స్వచ్ఛ్భారత్ చిరునామాగా చల్లపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, సెప్టెంబర్ 19: స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చల్లపల్లిని చూడమని చెబుతానని ప్రజలను, యువతను ప్రేరేపించనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. స్వచ్ఛ చల్లపల్లి 1408వ రోజు కార్యక్రమంలో బుధవారం ఉదయం పాల్గొన్న లక్ష్మీనారాయణ కార్యకర్తలు చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్భారత్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఇతర దేశాలలో స్వచ్ఛత, పరిశుభ్రత కారణంగానే అందంగా కనిపిస్తాయన్నారు. జెడీ ఫౌండేషన్ వ్యవసాయ రంగంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. తన ఉద్యోగానికి రాజీనామ చేసిన అనంతరం ఏ రాజకీయ పార్టీలో చేరతారని మీడియా మిత్రులు అడుగుతున్నారని, తాను ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. తన 11వ జిల్లా పర్యటన చల్లపల్లితో ప్రారంభమైనట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనతో 13 జిల్లాలు పూర్తయిన తరువాత భవిష్యత్ కార్యచరణ వెల్లడిస్తానన్నారు. నేటి రాజకీయాల్లో కులం, డబ్బు, మద్యం ప్రభావం అధికమైందని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం పూర్తిగా మానేసి గ్రామం ఉంటే తాను దత్త తీసుకుంటానన్నారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో భాగస్వామి కావటం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. అనంతరం స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను లక్ష్మీనారాయణ వీక్షించారు. స్వచ్ఛ చల్లపల్లి రథ సారథులు డా. డిఆర్‌కె ప్రసాద్, పద్మావతి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్టు డా. గోపాలం శివన్నారాయణ, స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు.

మహనీయుల జీవిత విశేషాలు తెలుసుకోవాలి
* సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అవనిగడ్డ, సెప్టెంబర్ 19: నేటి యువతరం గాంధీజీ, అంబేద్కర్, అబ్దుల్ కలామ్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నిర్వహించిన ప్రగతి విద్యా సంస్థల విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టెట్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన కుసుమ, ప్రభాకర్‌తో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏ పని చేసినా, ఏ ఉద్యోగంలో ఉన్నా విలువలతో నిస్వార్ధంగా, నిజాయితీగా పని చేయాలన్నారు. మహనీయుల జీవితం ఆధారంగా వచ్చిన ఆటో బయోగ్రఫీ పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునన్నారు. మన కోసం కాకుండా సమాజం, దేశం కోసం యువత ఆలోచన చేయాలన్నారు. బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలను చూస్తూ యువత, విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ జరిగిన విషయాలను నిద్రించే ముందు మంచివాటిని మననం చేసుకోవాలన్నారు. చదువుతో పాటు ఆటలు ఆడడం, మంచి కథలు చదవడం చేయాలన్నారు. టీవీలు చూస్తూ సమయాన్ని వృధా చేయరాదన్నారు. అనంతరం లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రగతి విద్యా సంస్థల అధినేత సనకా పూర్ణచంద్రరావు, ఎన్‌ఆర్‌ఐ వికాస్ ప్రిన్సిపాల్ కె వెంకటేష్, కరస్పాండెంట్ సింహాద్రి కెప్టెన్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

నవరత్నాలతో రాష్ట్భ్రావృద్ధి
* సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 19: వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నవరత్న పథకాలు అమలు చేస్తామని, ఆ పథకాలతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని వైసీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 27వ వార్డు శాంతినగర్‌లో ఇంటింటికి వెళ్లి నవరత్న పథకాలను వివరిస్తూ ఆ పథకాలతో సామాన్యులకు ఎలా మేలు జరుగుతుందో వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.