విజయవాడ

ట్రాఫిక్ చక్రబంధంలో నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంమర్ 20: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా విజయవాడ మారిన నేపథ్యంలో ట్రాఫిక్ మరింత జఠిలంగా తయారయింది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో ఉన్న చిన్న చిన్న రహదారులు, ప్రధాన రహదారుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ట్రాఫిక్ కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ హైవే నగరం మధ్యలో నుండే వెళ్తున్న పరిస్థితుల్లో సాయంత్రం సమయంలో ట్రాఫిక్ కష్టాలు నగర వాసులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గురువారం పరిస్థితి మరీదారుణం. ఇటు జ్ఞానభేరి... అటు ప్రారంభోత్సవాలు...మధ్యలో ప్రమాణ స్వీకారాలతో గురువారం నగరంలో ట్రాఫిక్ కష్టాలు నగర వాసులకు నరకాన్ని చూపించాయి. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా జ్ఞానభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రామవరప్పాడు వద్ద నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సంతో పాటు ప్రసాదం పాడులో ఏపీఎస్‌సీసీ చైర్మన్ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంతో వందలాదిగా వాహనాలు ఇటు బందరు రోడ్డుపైకి, అటు ఏలూరు రోడ్డుపైకి ఒక్కసారిగా రావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. దీనికి తోడు సాయంత్రం సమయంలో ఉన్న రద్దీ, హైవే మీదుగా వెళ్తున్న భారీ వాహనాల ప్రభావంతో గురువారం సాయంత్రం 6గంటల నుండి ఇటు బందరురోడ్డు అటు ఏలూరురోడ్డులో వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జ్ఞానభేరి బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎంతో పాటు మంత్రులు, వేల సంఖ్యలో విద్యార్థులు పలువాహనాల్లో బందరు రోడ్డుకు చేరుకున్నారు. రామవరప్పాడు వద్ద వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడంతో రామవరప్పాడు ప్రాంత వాసులతో పాటు గన్నవరం ప్రాంతం నుండి తెదేపా నేతలు, కార్యకర్తలు వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఏపీఎస్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎవి సుబ్బారావు అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున అళ్లగడ్డ, నంద్యాల నుండి సుమారు 300 వాహనాల్లో ప్రసాదం పాటు సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో వాహనాల రాక పెద్ద ఎత్తున పెరిగింది. ఎక్కడికక్కడ ఉన్న సిగ్నల్స్ వద్ద పడిగాపులు పెరిగాయి. ఈ సమయంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఆటోనగర్ మహానాడు రోడ్డులో లారీల రాకపోకలను నియంత్రించడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. హెల్త్‌యూనివర్సిటీ వద్ద లారీలను రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేయడంతో పెద్ద సంఖ్యలు లారీలు మహానాడు ప్రారంభం నుండి ఆటోనగర్‌లోని వరకు నిలిచిపోయాయి. ఆ ప్రభావం ఆటోనగర్ వంద అడుగుల రహాదారిపైన కూడా పడటంతో వంద అడుగుల రహదారిలో లారీలు, బస్సులు కూడా నిలిచిపోయి, ఇటు ఆటోనగర్ గేటు వరకు ఆప్రభావం కనిపించింది. దీంతో ఆటోనగర్ గేటు వద్ద బందరు రోడ్డుపై కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వివిధ కార్యాలయాలు, కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్తున్న వారు ఈ ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ట్రాఫిక్‌లో మంత్రులు కూడా చిక్కుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం నుండి తిరిగి వస్తున్న సమయంలో మంత్రులు, ఇతర కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ప్రభుత్వ విప్ పయ్యావుల కేశవ్ కూడా ట్రాఫిక్ చక్ర బంధంలో చిక్కుకున్నారు.