విజయవాడ

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపడంలో యువత భాగస్వామ్యం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: యువత వారి ఆలోచనలకు ప్రతిరూపంగా ఆవిష్కరణలు ఆకట్టుకుంటున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో అగ్రగ్రామిగా నిలపడంలో మీ భాగస్వామ్యం కీలకంగా నిలవనుందని అందుకు మిమల్ని స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులను అభినందించారు. గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 3వ విడత జ్ఞానభేరి కార్యక్రమంలో జ్ఞానభేరి వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులను ఆయన అభినందించి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగంలో ధనేకుల ఇంజనీరింగ్ విద్యార్థి కే ఈశ్వర శేషసాయి ‘వన్‌టచ్ ఈ - గవర్నెన్స్’ యాప్‌ను ఆవిష్కరించి ప్రభుత్వ సేవల్లో సరళీకృత విధానాలను వివరించారు. ఇంజనీరింగ్ విభాగం ద్వితీయ స్థానంలో బీ లక్ష్మీ తిరుపతమ్మ, ఎం లావణ్య నిలిచారు. సైన్స్ విభాగంలో సిద్ధార్థ కళాశాలకు చెందిన ప్రవల్లిక ప్రజంటేషన్ అందించారు. ద్వితీయ స్థానంలో అనంత అభినయ్, తృతీయ స్థానంలో రాజలాస్య నిలిచారు. వ్యవసాయ విభాగంలో తొలి స్థానంలో ఎ రావూఫ్, ద్వితీయ స్థానంలో ఎం ప్రణీత, తృతీయ స్థానంలో పవన్ సాయి కిరణ్ నిలిచారు. పశుసంవర్ధక విభాగంలో ఐ రిషిత రాష్ట్రంలో పాల ఉత్పత్తులు, రాష్ట్రంలోని ఆశావాహ పరిస్థితులపై ప్రత్యేక ప్రజంటేషన్, అందించారు. ఈ విభాగంలో ద్వితీయ స్థానంలో డీ మేరిస్ స్టెల్లా, తృతీయ స్థానంలో బీ మానస నిలిచారు. కబడ్డీ విభాగంలో ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ విద్యార్థులు తొలి స్థానంలోను, ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఉయ్యూరు ద్వితీయ స్థానంలోను, విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు మూడవ స్థానంలో నిలిచారు. క్రాస్ కంట్రీ రేస్ మహిళల విభాగంలో ఏజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఉయ్యూరు తొలి స్థానంలోను, ఎస్‌డీఎం సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ ద్వితీయ స్థానంలోను, వికాస్ కాలేజీ ఫిజికల్ ఎడ్యూకేషన్ నున్న కళాశాల మూడవ స్థానంలోను నిలిచారు. క్రాస్ కంట్రీ రెస్ పురుషుల విభాగంలో ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఉయ్యూరు తొలి స్థానంలోను, ఆంధ్ర లయోలా కాలేజీ విజయవాడ రెండవ స్థానంలోను, ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ మూడవ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.