విజయవాడ

రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా శాఖలోని ఖాళీలన్నింటినీ తక్షణం భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ తక్షణం భర్తీ చేయాలని కార్యాలయాల్లో వౌళిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం జరిగిన ఆంధ్ర ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ రవికుమార్, కే రాజ్‌కుమార్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేవం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ విలేఖర్లతో మాట్లాడారు. గత ఏప్రిల్ నుంచి లావాదేవీలన్ని సీఎఫ్‌ఎంఎస్ పద్ధతిలో జరుగుతున్నాయని అన్నారు. అయితే బ్రిటీష్‌కాలం నాటి ట్రెజరీ కార్యాలయాల్లో విధుల నిర్వహణ దుర్భరంగా ఉందన్నారు. తమ ఒత్తిడితో ప్రభుత్వం తొలి దశలో 66 భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినప్పటికీ పనులు మాత్రం ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. ఇతర శిథిలావస్థలో నున్న వాటి స్థానంలో కూడా కొత్త భవనాల్లో మార్చాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్ విధానం వల్ల ఉద్యోగులపై విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. దీనిన నివారించేందుకు ప్రతి జిల్లాకు కార్యాలయం అదనంగా నాలుగు ఆర్టీవో పోస్టులు 10 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉప ఖజానా కార్యాలయంలో కనీసం రెండు పోస్టులను మంజూరు చేయాలన్నారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, విశాఖ కార్యాలయ పరిధిలో 15వేల మంది చొప్పున పెన్షనర్‌లుంటే ఆయా పట్టణాల్లో డీటీఓ పోస్టులను, ఏడీ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ప్రతి నాలుగు మండలాలకు ఒక సబ్ ట్రెజరీ కార్యాలయం ఉండాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కార్యవర్గాన్ని రద్దు పరచినందున అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు డీకే రాజు, కోశాధికారి గోపాలరావు, ఉపాధ్యక్షురాలు జీ రాణి, వివిధ జిల్లాల అధ్యక్షులు శోభన్‌బాబు, అహ్మద్, కిరణ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలకు భారీ స్పందన
విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 23: ఏటా కేంద్రం నిర్వహిస్తున్న ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు ప్రభుత్వ పాఠాశాలల నుండి పెద్ద ఎత్తున హాజరౌతున్నారని, వీరికి అవసరమైన పూర్తి శిక్షణను ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కే రాజ్యలక్ష్మీ తెలిపారు. ఇప్పటి వరకు ఈ పరీక్షకు సంబంధించి 2322 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆదివారం ఈ విలేఖరికి తెలిపారు. ఈపరీక్షకు సంబంధించి డిప్యూటీ డీఈవోలు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్హలైన విద్యార్థులను గుర్తించి వారు ఈ పరీక్ష రాసేవిధంగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు ఈపరీక్షపై అవగాహన, చైతన్యం కల్పిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈఏడాది పరీక్షకు హాజరైయ్యే విద్యార్థుల శాతం అధికంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కృష్ణవేణి ఘాట్‌లో స్వచ్ఛతే సేవ
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 23: స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం కృష్ణవే ణి ఘాట్‌ను శుభ్రం చేశారు. వీఎంసీ ప్రజారోగ్య శాఖ, వివేకానంద యూత్ సొసైటీ విద్యార్థులు వంద మంది సీత మ్మ వారి పాదాలు కృష్ణవేణి ఘాట్ మె ట్టు, పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం తొలగించి సోప్ ఆయిల్‌తో కడిగి శు భ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రత, ప ర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యమైతే నగరంలో ఎక్కడా అపరిశుభ్రత కనిపించదని, స్వచ్ఛ సర్వేక్షన్ లో దేశంలోనే 4వ ర్యాంకు పొందిన విజయవాడ రానున్న కాలంలో మొద టి ర్యాంకు సాధంచే దిశగా అందరూ కృషి చేయాలని ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అర్జున రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారులు డాక్టర్ ఎస్ రాజు, ఇక్బాల్ హుస్సేన్, వివేకానంద యూత్ సొసైటీ విద్యార్థులు పాల్గొన్నారు.