విజయవాడ

ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 24: ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూధార్ అమల్లో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని కలక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును కలెక్టర్ లక్ష్మీ కాంతం సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయించి, విన్నవించుకుంటున్నారని, అటువంటి సమస్యలను వెనువెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ సమస్యలపై కలెక్టర్ యాప్, వాట్సాప్ మొదలుగు సమాచార విధానాల ద్వారా ప్రజలు జిల్లా నలుమూలల నుండి వారి సమస్యలు తెలియజేస్తున్నారని వాటిని పరిష్కరించి తగు సమాచారాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సమాచారాన్ని సెల్‌ఫోన్‌ల ద్వారా అధికారుకలు తెలియజేసినా కొంతమంది అధికారులు ఆలస్యంగా స్పందించడం పట్ల కలక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని, ప్రతి అధికారి ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించాలని కలక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న అన్న అమృతహస్తం, ఎన్‌టిఆర్ వైద్యసేవ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, రేషన్ పంపిణీ, ఫించన్‌ల పంపిణీ, అన్న క్యాంటిన్ నిర్వహణ మొదలగు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలక్టర్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ, భూగర్భగనుల శాఖ ప్రజాసంతృప్తి శాతంలో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచినవని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. భూదార్ రిజిస్ట్రేషన్‌లో రాష్ట్రంలోనే అన్నీ జిల్లాల కంటే 87.44 శాతం ప్రగతి సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిచిందని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులకు తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఇంకా 1300 మందికి వేలిముద్రలు సరిగాలేని కారణంగా రేషన్ అందడం లేదని, రెండురోజుల్లోగా విఆర్వోలు గుర్తింపు ద్వారా వారందరికి రేషన్ పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా పంచాయతీ ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో నీరు నిల్వ ఉండకూడదని చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజలకు సురక్షితమై మంచినీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు వాతావరణంలో మార్పుల కారణంగా దోమలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆక్టోబర్ నెలలో జిల్లాలో లక్షా 40 వేల మందికి ఇళ్ల స్థాలాల పంపిణీకి ఇందుకు సంబంధించి ఆయా మండల రెవెన్యూ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ 21, 22న చేయూత ద్వారా విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం వివరించారు.