విజయవాడ

వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేవి యువజనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: మానసిక, వ్యక్తిత్వ వికాసానికి విద్యతో పాటు యుజవనోత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. కృష్ణా వర్సిటీ కృష్ణాతరంగ-2018లో భాగంగా నగరంలోని పీబీ సిద్థార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో యూత్ ఫెస్టివల్‌లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యతోపాటు యువజనోత్సవాలు, సంస్కృతీ, క్రీడా రంగాల్లో అంతులేని ప్రతిభ కనబర్చిన వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యాభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఫలాలు కనిపిస్తాయన్నారు. అభివృద్ధికి యువశక్తి ప్రాధాన్యత ఎంతైనా ఉందన్నారు. కొన్ని దేశాల్లో యువశక్తి తగ్గిపోతున్న నేపథ్యంలో మనదేశంలో యువశక్తి పటిష్ఠంగా ఉందన్నారు. యువకులు అన్ని రంగాల్లో నైపుణ్యతను జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. భాష, భావం, స్వేచ్ఛ కలిసేలా యువత పయనిస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. కృష్ణా వర్సిటీ నిర్వహిస్తున్న ఈపోటీల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనపర్చిన వారు సౌత్‌జోన్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. కృష్ణా వర్సిటీ పరిధిలో కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఈపోటీల్లో చక్కటి క్రమశిక్షణతో రాణించి మంచి పేరు తేవాలని కలెక్టర్ లక్ష్మీకాంతం ఆకాంక్షించారు. కృష్ణా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఎస్ రామకృష్ణరావు మాట్లాడుతూ 2008లో స్థాపించిబడిన కృష్ణా యూనివర్సిటీ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కృష్ణాతరంగం 2018 జిల్లాలోని వివిధ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొంటున్నారని వైస్ ఛాన్సలర్ రామకృష్ణ తెలిపారు.