విజయవాడ

జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 24: కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గ పదవీ కాలం ముగిసినందున మరో 6నెలలు పాటు పొడిగించుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చైర్మన్ కంచి రామారావు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక హోటల్‌లో సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం పదవీకాలం పొడిగించినందుకు సీఎం చంద్రబాబుకు, సహకార శాఖ మాత్యులు సీహెచ్ ఆదినారాయణ రెడ్డికి పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేయటం జరిగిందన్నారు. 2005లో డీసీఎంఎస్ మూలధనం కేవలం రూ.1.49లక్షలతో ప్రారంభమై 2017-18 నాటికి రూ.176.45 కోట్ల వ్యాపారం చేసి రూ.2.5కోట్ల స్థూల లాభం, రూ.22.15లక్షల నికర లాభం ఆర్జించిందని తెలిపారు. ఇటీవల నగరంలోని సూర్యారావుపేటలో సొసైటీకి నూతన భవనం నిర్మించుకోవటానికి రూ.2.47కోట్లతో 249.8 చదరపు గజాల స్థలం కొనుగోలు చేయటం జరిగిందన్నారు. ఈ స్థలంలో రూ.1.3కోట్ల అంచనా వ్యయంతో నూతన భవనం నిర్మించటానికి ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగిందన్నారు. మార్కెటింగ్ సంఘాల నుండి సుమారు రూ.1.23కోట్లు డిపాజిట్లు సేకరించటం జరిగిందన్నారు. మచిలీపట్నం, నూజివీడులో డీసీఎంఎస్‌కు స్థలం బదలాయింపు చేసుకోవటానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. జిల్లాలో 25 సెంటర్ల ద్వారా గడిచిన ఖరీఫ్, రబీ సీజన్‌లో రూ.135కోట్ల విలువైన ధాన్యం, రూ.24కోట్ల విలువగల అపరాల కనీస మద్దతు ధరకు సేకరించటం జరిగిందన్నారు. 25సెంటర్ల నుండి రె