విజయవాడ

రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 25: రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని, ఈ దిశగా రవాణా, పోలీస్ శాఖలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి సమావేశానికి ఆయన అధ్యతన వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల మృతుల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు ఉంటున్నారని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా పోలీస్, రవాణా శాఖలు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. విజయవాడ నగరంలోనే 6లక్షల మోటార్ బైక్‌లు ఉన్నాయని, వీరిలో ఎందరు హెల్మెట్ ధరిస్తున్నారనేది పరిశీలించాలన్నారు. హెల్మెట్ లేని వారిపై ప్రతిరోజూ 3వేల కేసులు నమోదు చేస్తున్నామని, నిఘాను పెంచవలసిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి సంబంధించి రెండుసార్లు కేసులు నమోదైతే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని, రవాణా శాఖ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. నిడమానూరు బ్రిడ్జి వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి అప్రోచ్ రోడ్ల వద్ద కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ అండ్ బీ, మున్సిపల్ కార్పొరేషన్, జాతీయ రహదారులకు సంబంధించి పెద్ద గుంతలను పూడ్చి రోడ్డు అభివృద్ధి పనులను రెండురోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కంట్రోల్ రూం నుండి బెంజి సర్కిల్ వరకు పాదచారులకు ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేయాలన్నారు. ఎనికేపాడు నుంచి రామవరప్పాడు వరకు రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమాన్ని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చేపట్టాలన్నారు. నందిగామ - అనాసాగరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కీసర టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణలను రెవెన్యూ, రవాణా, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తొలగించాలన్నారు. పెదపారుపూడి ఆర్ అండ్ బీ రోడ్డు వెంబడి ఉన్న కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మించాలన్నారు. బెంజి సర్కిల్ నుండి గన్నవరం వరకు రోడ్డు వెంబడి గ్రీనరీని అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రోడ్ సేప్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా రోడ్డు భద్రతా నిధి నుంచి రవాణా, పోలీస్ శాఖలకు అదనంగా 15 స్పీడ్ గన్స్, 50 బ్రీత్ ఎనలైజర్స్, 30 ఎంపీడీ డివైస్‌లు మంజూరు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు. సమావేశంలో దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మీరాప్రసాద్, డీసీపీ (ట్రాఫిక్) రవిశంకర్, అదనపు డీసీపీ పీవీ నాగరాజు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ పి రాధాకృష్ణ, ఈఈ మాధవస్వరూప్, నేషనల్ హైవేస్ పీడీ విద్యాసాగర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అవినీతిని నిరూపించండి!
* సీపీఎం ఆరోపణలపై టీడీపీ సవాల్
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 25: రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అధికార టీడీపీపై లేనిపోని అరోపణలు చేయడం సీపీఎం నేతలకు పరిపాటిగా మారిందని టీడీపీ అర్బన్ నేత, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు పేర్కొన్నారు. వీఎంసీ అవినీతిపై ఏమైనా ఆధాలుంటే తక్షణమే నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వీఎంసీకి అవార్డులిచ్చేవారు అమాయకులు కాదని, అన్ని విషయాలు పరిశీలించాకే అవార్డులిస్తారన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. వామపక్ష పాలనలో ఒక్క అవార్డు అయినా సాధించలేదన్నారు. ప్రస్తుత టీడీపీ నగర పాలనలో 24 అవార్డులు సాధించడం మేయర్‌గా కోనేరు శ్రీ్ధర్‌కే సాధ్యమైందని తెలిపారు. సీపీఎం నేతలు ఆరోపించిన శానిటరీ పని వస్తువుల విషయాన్ని మేయర్ స్వయంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని, ఇదే ఆయన నీతివంతమైన పాలనకు నిదర్శనమని అన్నారు. వామపక్షాల హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, రాఘవయ్యపార్కులో నిర్మించిన వంతెన కూలి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిన ఘటన నగర ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. కార్పొరేటర్లను ఎమ్మెల్యేల కలెక్షన్ ఏజెంట్లని అనడం వారి మనోభావాలను కించపర్చడమేనన్నారు. కార్పొరేటర్ల ఆదాయాలపై ఏమైనా ఆధారాలుంటే ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉనికి కోల్పోయిన వామపక్ష నేతలు ప్రజలను, కార్మికులను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకోవడం గర్హనీయమని, ఇకనైనా ఇటువంటి అనైతిక చర్యలను మానుకుని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని హనుమంతరావు హితవు పలికారు.