విజయవాడ

రుణాల మంజూరులో ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 25: లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతూ 5 బ్యాంకుల్లో ఉన్న రూ. 50కోట్ల ప్రభుత్వ డిపాజిట్లను ఉపసంహరిస్తున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం ప్రకటించారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన బ్యాంకర్లు, వివిధ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జిల్లా అధికారులతో లబ్ధిదారులకు రుణాల మంజూరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్ల నిర్లక్ష్య ధోరణి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, కేడీసీసీ బ్యాంకుల్లో ఉన్న రూ. 50కోట్ల ప్రభుత్వ డిపాజిట్లను తక్షణమే ఉపసంహరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డిపాజిట్ల ఉపసంహరణపై సంబంధిత బ్యాంకుల చైర్మన్లు, జీఎంలతో కలెక్టర్ ఫోన్‌లో స్వయంగా మాట్లాడి సమాచారం అందించారు. బ్యాంకర్లతో పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలుపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సమీక్ష సమావేశంలో ఎల్‌డీఎం రామ్మోహన్‌రావు, నాబార్డ్ ఏజీఎం తురుమల్ల విజయ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజిరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఈశ్వరరావు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.