విజయవాడ

నేడు దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 13: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న మీడియాపాయింట్‌లో శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించటం సంప్రదాయంగా వస్తోందన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆలయాధికారులు విస్తుృతస్థాయిలో ఏర్పాటు చేయటంతో భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులులేకుండా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. గత సంవత్సరం కంటే ఈసంవత్సరం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది శనివారం ఉదయానే్న ఇంద్రకీలాద్రికి వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

అన్నప్రసాదాన్ని స్వీకరించిన కలెక్టర్
ఇంద్రకీలాద్రి,అక్టోబర్ 13: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం ఆధ్వర్యంలో శంకరమఠంలోని నిత్యాన్నదానకేంద్రాన్ని శనివారం కలెక్టర్ బీ లక్ష్మీకాంతం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన నేరుగా భక్తులతో కలిసి వారితో అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన ప్రభుత్వ ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.