విజయవాడ

ఆలయాల్లో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 16: దసరా మహోత్సవాల్లో 7వ రోజైన మంగళవారం భక్తులు ఉదయం 6గంటల నుండే తరలి రావటంతో నగరంలోని పలు ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా కనబడింది. వచ్చిన భక్తులు తొలుత అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత మిగతా దేవతామూర్తుల దర్శనం చేసుకున్నారు. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చింది. తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ, ఆలయ అర్చకుడు జయంతి సత్యవరప్రసాద్ (బుత్తి) ఆధ్వర్యంలో అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ తదితరులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలను చేయించారు. ఇందులోభాగంగా మంగళవారం అమ్మవారి సన్నిధిలో సుమారు 40 మంది దంపతులచేత కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయించారు. ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ఆలయంలో భక్తుల సందడి కొనసాగింది. సాయంత్రం అమ్మవారి సన్నిధిలో వివిధ రకాలైన అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ సిబ్బంది భక్తులకు రెండు రకాలైన ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. కాళేశ్వరరావుమార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం మిచ్చారు. ఉదయం వివిధరకాలైన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రత్యేక ఉభయదాతల పూజల్లో 60 మంది దంపతులు పాల్గొన్నారు. మాజీ ధర్మకర్తలు పొట్నూరి దుర్గా ప్రసాద్, అడ్డూరి లక్ష్మణరావు, సోషల్ వర్కర్ డి రాము, సీపీఎం నేత పొట్నూరి చిన్న, దుర్గగుడి మాజీ ధర్మకర్త కెవి జగన్‌మోహన్‌రావు, తదితరులు విచ్చేసి ఇక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఉత్సవకమిటీ సభ్యులు వీరిని సత్కరించి అమ్మవార్ల ప్రసాదాలను అందచేశారు. యనమలకుదురు లాకుల వద్ద ఉన్న శ్రీకనకదుర్గాదేవి అలయంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ప్రత్యేక ఉభయ దాతల పూజలల్లో సుమారు 50 మంది దంపతులు పాల్గొన్నారు. ఇందులోభాగంగా సాయంత్రం అమ్మవారి సన్నిధిలో సంకీర్తన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి సత్య హరిచంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. గవర్నర్‌పేట శ్రీ కాశీ విశే్వశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం మిచ్చింది. ఈసందర్భంగా ఆలయ ఈవో వై సీతారామయ్య సూచన మేరకు అర్చకులు వివిధ రకాలైన జపాలు, హోమాలు,తదితర వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక ఉభయదాతల పూజల్లో 50 మంది దంపతులు పాల్గొన్నారు. పాతబస్తీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ వైష్ణవీ దేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం మిచ్చింది. ప్రత్యేక ఉభయ దాతల పూజల్లో 30 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఈవో హేమలతాదేవి సూచన మేరకు ఆలయ సిబ్బంది భక్తులకు పెద్ద ఎత్తున్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రకాశం బ్యారేజీ కూడలి ఎదుట ఉన్న శ్రీ విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం మిచ్చింది.

అభివృద్ధి, సంస్కరణలపై చర్చ
* జర్మనీ ప్రతినిధులతో కమిషనర్ నివాస్ భేటీ
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 16: అమరావతి అభివృద్ధిలో భాగంగా జర్మనీ దేశం నుండి వచ్చిన ఎంఎల్‌ఐటి ప్రతినిధుల బృందం గుంటూరు, విజయవాడ నగరాల్లో అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేస్తోంది. ఈ బృందం సభ్యులు మంగళవారం నగర కమిషనర్ జె నివాస్‌తో పలు అంశాలపై చర్చించారు. విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి, సంస్కరణలు, ప్రజలకు అందుబాటులో ఉంచిన వౌలిక వసతులైన తాగునీరు సరపరా, సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, ఇంటింటి చెత్త సేకరణ, సేగ్రీగేషన్ ప్రక్రియ, చెత్త తరలింపు, వర్మికంపోస్ట్, డంపింగ్ యార్డ్‌ల నిర్వహణ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సోలార్ వ్యవస్థ, సూయజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనితీరు, బిల్డింగ్ నిర్మాణాలకై అవలంబిస్తున్న నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర అంశాలపై చర్చించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న వౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేయనున్నట్లు జర్మనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ పి అదిశేషు, ఎస్‌ఈ జెవిరామకృష్ణ, అదనపు కమీషనర్ పి చంద్రశేఖర్, సిటీ ప్లానర్ బి లక్ష్మణరావు, డిప్యూటీ కమీషనర్ జి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.