విజయవాడ

శ్రీ మహాలక్ష్మీ.. మంగళప్రదాయనీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 16: అన్ని పనుల్లో విజయం సాధించటంతోపాటు ఐశ్వర్య ప్రాప్తి కోసం ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతోఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. లోక స్ధితి కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం మిచ్చింది. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేస్తున్న ఒక అద్భుత ఘట్టాన్ని చూసిన భక్తులు ఆనందంతో పులకించారు. మంగళప్రదమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం చేసుకొని తరలించటానికి భక్తులు ఇంద్రకీలాద్రికి వేలాదిగా తరలి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి భక్తులు తరలి వచ్చారు. శ్రీ మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చన కార్యక్రమంలో 7వ రోజైన మంగళవారం సుమారు 200 మంది దంపతులు, చండీహోమంలో 100 దంపతులు మొత్తం 300 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజల్లో దేవదాయ ధర్మదాయశాఖకు చెందిన పలువురు ఉన్నతస్థాయి అధికారులు, పలువురు న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు తర్వాత వీరికి పర్యవేక్షణాధికారి ఎన్ రమేష్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలను అందచేసి, ప్రత్యేక క్యూమార్గం ద్వారా అమ్మవారి దర్శనం చేయించారు. ప్రతిరోజు ఉభయదాతలు దర్శనం కోసం వచ్చే సమయంలోనే వీఐపీలు రావటంతో దర్శనం విషయంలో కొంత మేరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈవిషయాన్ని ఈవో దృష్టికి సెక్షన్ అధికారి తీసుకువెళ్ళగా ప్రత్యేక ఉభయదాతలు వచ్చే సమయంలో వీఐపీలను కొంతసేపు వేచి ఉంచాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం ఉభయ దాతలు ప్రత్యేక పూజలు అయిన వెంటనే ప్రత్యేక క్యూమార్గం ద్వారా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ భక్తులు కెనాల్ రోడ్ వినాయకుని గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోనికి ప్రవేశించి రథం సెంటర్, శ్రీ విజయేశ్వర స్వామివారి దేవస్థానం, దుర్గా ఘాట్ మీదుగా అమ్మవారి టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి ఘాట్‌రోడ్ మార్గం గుండా కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకు రాధాకృష్ణుల విగ్రహం వద్ద ఆలయ సిబ్బంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రారంభించిన అప్పం, అమ్మవారి కుంకుమ ప్రసాదం, తదితర వాటిని భక్తులకు ఉచితంగా పంపిణీని చేశారు. తర్వాత భక్తులు మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకొని మెట్ల మార్గం గుండా కనకదుర్గనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తులు అమ్మవారి మహాప్రసాదాలలైన లడ్డూ, పులిహార, తదితర వాటిని కొనుగోలు చేసి ఎదురుగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదాన్ని సుమారు 10వేల మంది భక్తులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి నగరానికి చేరుకున్న వారిలో కొంతమంది భక్తులు దుర్గాఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరికొంతమంది భక్తులు కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఎన్‌సీసీ విద్యార్ధులు క్యూమార్గాల్లో ఉన్న భక్తులకు, వివిధ సెంటర్లలో భక్తులకు నిరంతరం వాటర్ ప్యాకెట్‌లను సరఫరా చేశారు.

సీఆర్‌డీఏ ఓపెన్ ఫోరంలో దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 16: అమరావతి రాజధాని గ్రామాల వారికి మంగళవారం ప్రత్యేకంగా ఉండవల్లిలో ఓపెన్ ఫోరం నిర్వహించినట్లు ఏపీసీఆర్‌డీఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె నాగసుందరి తెలిపారు. అన్ని నిబంధనలు పాటించిన వారికి దరఖాస్తులు పరిశీలించి అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాజధాని గ్రామాల పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చిన గ్రామంలో ప్రతి మంగళవారం ఓపెన్‌ఫోరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయవాడ ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం ఓపెన్‌ఫోరం జరుగుతుందన్నారు. ఉండవల్లిలో ఆరు దరఖాస్తులు రాగా ఒక దరఖాస్తును ఆమోదించడం జరిగిందన్నారు. మరో మూడు అదనపు సమాచారం కోరడం జరిగిందని, రెండు తిరస్కరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈకర్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్లు సిహెచ్ మధుసూదనరావు, టి నరేంద్రనాధ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.