క్రైమ్/లీగల్

స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 16: మండలంలోని రావికంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మంగొల్లు రోడ్డులోని స్పాట్స్ (స్పిన్నింగ్ మిల్) కర్మాగారంలో మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆరు బ్లాక్‌లుగా ఉన్న కర్మాగారంలో ఒక బ్లాక్‌లో మొదలైన మంటలు కొద్ది సమయంలోనే మిగిలిన వాటికి వ్యాపించాయి. దీనిలో పని చేస్తున్న కార్మికులు మంటలు గుర్తించి కేకలు పెడుతూ బయటకు రావడంతో మిగిలిన వారు అప్రమత్తమయ్యారు. ఈ కర్మాగారంలో పత్తిబేళ్లను పెద్ద ఎత్తున నిల్వ చేసి ఉంచారు. మంటలకు ఎక్కువ శాతం పత్తిబేళ్లు ఆహుతి అవ్వడంతో పాటు మంటలకు కర్మాగారం గోడలు బీటలు వారాయి. కర్మాగారంలోని యంత్రాలకు సైతం నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ అధికారి ఆంజనేయులు సిబ్బందితో అగ్నిమాపక శకటంతో వెళ్లి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. జగ్గయ్యపేట తహశీల్దార్ నర్శింహరావు, విఆర్‌ఒ ఎలూరి రాంబాబు, చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్, త్రినాధ్, పోలీస్ సిబ్బంది ప్రమాదం జరిగిన కర్మాగారం వద్ద నివారణ చర్యలు చేపట్టారు. కర్మాగారం ముందు భాగంలో గల గదిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా వాటిని అదుపులోకి తెచ్చేందుకు సరైన మార్గం, సదుపాయం లేకపోవడంతో పోలీసులు జెసీబీ తెప్పించి కర్మాగారం గోడలు పగులగొట్టించి మంటలు ఆర్పించే ప్రయత్నం చేశారు. కొద్ది గంటల పాటు ఈ ప్రక్రియ జరగ్గా ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కాగా పత్తి కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 500మంది పని చేసే కర్మాగారంలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సిబ్బంది నివారణ చర్యలు చేపట్టడం స్థానికుల అనుమానాలకు బలం చేకూరుస్తుంది. విజయవాడలో ఉండే సంస్థ యాజమాన్య ప్రతినిధులు సాయంత్రం వరకూ కర్మాగారానికి రాలేదు. గతంలో పలు మార్లు ఈ కర్మాగారంలో అగ్ని ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతుండగా ఈ ఏడాదిలోనే మూడవ సారి జరిగినట్లు ఫైర్ అధికారి తెలిపారు. చిన్న పాటి కర్మాగారాలకు సవాలక్ష ఆంక్షలు, జాగ్రత్తలు పెట్టే అధికార యంత్రాంగం ఇంత పెద్ద కర్మాగారంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి కారణం తెలియకపోగా అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం రూ.40లక్షల ఆస్తినష్టం ఉంటుందని, తమ శాఖ పూర్తిగా పరిశీలన చేసి అంచనాలు రూపొందించాల్సి ఉందని ఫైర్ అధికారి ఆంజనేయులు తెలిపారు. ఇంతకు ముందు కర్మాగారంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తగిన పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని తమ శాఖ తరపున నోటీసులు ఇవ్వడం జరిగిందని, అలాగే అగ్ని ప్రమాదాలపై పై అధికారులకు నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు.