విజయవాడ

నీ భావజాలమేమిటో చెప్పగలవా పవన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: కాటన్ బ్యారేజీపై కవాతు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనది ఏ భావజాలమో చెప్పగలరా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు నిలదీశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకో విధంగా మాట్లాడే పవన్ అధికారమే పరమావధిగా, ముఖ్యమంత్రి పదవి రాకుంటే జీవితమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కవాతుకు వచ్చిన జనానికి ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. రాజకీయ వ్యవహారాల గూర్చి తెలియని పవన్ ముఖ్యమంత్రిని, లోకేష్‌ను విమర్శించడం ఆయనలోని అభద్రతా భావాన్ని తెలియచేస్తోందన్నారు. తన పార్టీ సిద్ధాంతమేమిటో, అనుసరించే రాజకీయ విధానాలేమిటో చెప్పలేని వ్యక్తి రేపురాష్ట్ర ప్రజలకు ఏం చెబుతారని, ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుని కాటన్ కట్టిన ధవళేశ్వరం బ్యారేజీని ఒకేలా చూడటం ఆయనలోని అఙ్ఞనానికి నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రాకు జరిగిన తుఫాన్ నష్టంపై కేంద్రాన్నిగాని, రాష్ట్రానికి వచ్చిన హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను గాని ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. ప్రజల తరఫునే మాట్లాడతాననే వ్యక్తికి బీజేపీని నిలదీసే ధైర్యం లేదని మరోసారి రుజువైందన్నారు. జగన్‌తో పవన్‌కున్న లాలూచీ ఏమిటో, ఆ ఇద్దరూ బీజేపీతో కలిసి ఆడుతున్న నాటకం ఏమిటో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావు గూర్చి అవహేళన చేయడం, వారి కుటుంబాలను అవమానించేలా మాట్లాడటం పవన్‌కే చెల్లిందన్నారు. ఒకరోజు నక్సలిజాన్ని గూర్చి, మరోరోజు కమ్యూనిజాన్ని గూర్చి, ఇంకోసారి చేగువేరా, అంబేద్కర్, గాంధీజీల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు తనది ఏ ఇజమో ఇంతవరకు బోధపడలేదని, అదేంటో తెలియకుండా హీరోయిజం చూపితే జీరోగా నిలవడం ఖాయమని జూపూడి ఎద్దేవా చేశారు.

మేయర్, కమిషనర్
దసరా శుభాకాంక్షలు
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 17: నగర ప్రజలకు మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జే నివాస్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు.

అమ్మదర్శనంతో అలౌకిక ఆనందం
* సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 17: దుర్గమ్మ దర్శనంతో తాను అలౌకిక ఆనందాన్ని పొందానని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. బుధవారం దుర్గమ్మను శ్రీదుర్గాదేవి అలంకారంలో దర్శించుకున్నారు. అధికారులు అంతరాలయ దర్శనం, ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మీడియా పాయింట్‌లో శ్రీరామ్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలతో ఆనందంగా జీవించాలని అమ్మను ప్రార్థించానన్నారు. దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం, శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ సిబ్బంది అభినందనీయులన్నారు. దుర్గమ్మ తనను సరస్వతీదేవి రూపంలో కరుణించిందన్నారు. ఈసందర్భంగా పాత్రికేయుల కోరికపై సరస్వతీదేవిపై పాటను పాడి వినిపించారు. పాటకు ముగ్దులై వెంటనే కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్-2 బాబురావు, ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు అనంతశ్రీరామ్‌ను అభినందించారు. శ్రీరామ్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.