విజయవాడ

దుర్గమ్మా.. కరుణించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: దుర్గతులను నశింపచేసి సద్గతులు, ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్య రూపిణీ శ్రీదుర్గమ్మ దర్శనానికి భక్తజనకోటి అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీకనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా దివ్య దర్శనం ఇవ్వటంతో భక్తులు కన్నులారా చూసి తరించారు. దుర్గే దుర్గతినాశని అనే వాక్యం అందరికీ శుభాలను కలుగ చేస్తున్న కారణంగానే ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజైన బుధవారం అమ్మవారు ప్రత్యేక అలంకారంతో భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ మల్లిఖార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో పాల్గొన్నారు. 8వ రోజైన బుధవారం రెండు బ్యాచ్‌లు కలిపి సుమారు 240 మంది దంపతులు, చండీహోమంలో 100 దంపతులు మొత్తం 340 మంది దంపతులు పాల్గొన్నారు. ఈప్రత్యేక పూజల్లో దేవదాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు, న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల తర్వాత వీరికి ఈసెక్షన్ పర్యవేక్షణాధికారి ఎన్ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ప్రసాదాలను అందచేసి ఒక ప్రత్యేక క్యూమార్గం ద్వారా అమ్మవారి దర్శనం చేయించారు. కెనాల్ రోడ్ వినాయకుని గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి ప్రవేశించిన భక్తులు రథం సెంటర్, శ్రీ విజయేశ్వరస్వామి దేవస్థానం, దుర్గాఘాట్, మీదుగా అమ్మవారి టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి ఘాట్‌రోడ్ గుండా కొండపైకి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు రాధాకృష్ణుల విగ్రహం వద్ద సిబ్బంది ఈఏడాది ప్రత్యేకంగా ప్రారంభించిన అప్పం, అమ్మవారి కుంకుమ ప్రసాదం భక్తులకు ఉచితంగా పంపిణీని చేశారు. తర్వాత భక్తులు మల్లిఖార్జునస్వామిని దర్శనం చేసుకుని మెట్ల మార్గం గుండా కనకదుర్గనగర్‌కు చేరుకున్నారు. ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తులు మహాప్రసాదాలలైన లడ్డూ, పులిహార కొనుగోలు చేసి ఎదురుగా ఉన్న దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కేంద్రంలో సుమారు 10వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వేకువ జామున 5గంటల నుండి ఉదయం 8గంటల వరకు అన్ని క్యూమార్గాల్లో భక్తుల సంఖ్య కొంత మేరకు తక్కువగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, కార్యకర్తలు, కొంత మేరకు ఊపిరీ పీల్చుకున్నారు. ఉదయం 8గంటల నుండి ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి నగరానికి చేరుకున్న భక్తులు దుర్గాఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరికొంతమంది భక్తులు కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఎన్‌సీసీ విద్యార్థులు క్యూమార్యం, వివిధ సెంటర్లలో భక్తులకు నిరంతరం వాటర్ ప్యాకెట్‌లను సరఫరా చేశారు.

సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో చండీహోమం
మోపిదేవి, అక్టోబర్ 17: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీ దుర్గా అమ్మవారు బుధవారం శ్రీ మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్‌కుమార్ శర్మ పూజలు నిర్వహించారు. ఏసీ ఎం శారదాకుమారి భక్తులతో కలిసి చండీహోమం నిర్వహించారు. వేదపండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ చండీహోమం నిర్వహించారు. పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ దుర్గా అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దనిగా అలంకరించి అర్చకులు శంకరమంచి భాస్కరశర్మ పూజలు నిర్వహించారు. మోపిదేవి శ్రీ సంకలేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ట్రస్టీ ఎ సూర్యనారాయణ, అర్చకులు దుర్గాప్రసాద్ పూజలు నిర్వహించారు. కొక్కిలిగడ్డ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దనిగా అలంకరించి పూజలు నిర్వహించారు. కోసూరువారిపాలెం శ్రీ రేణుక అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు.

సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు
‘ఎస్‌విఎల్’ విద్యార్థులు
అవనిగడ్డ, అక్టోబర్ 17: సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు అవనిగడ్డ ఎస్‌వీఎల్ క్రాంతి కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇటీవల విజయవాడ సిద్దార్ధ కళాశాలలో నిర్వహించిన అండర్-19 విభాగం కబడ్డీ జిల్లా సెలక్షన్స్ నిర్వహించగా అత్యధిక ప్రదర్శన కనబర్చిన విద్యార్థులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. బాలికల జట్టుకు చాట్రగడ్డ ఐశ్వర్య ఎంపిక కాగా, బాలుర విభాగంలో యలవర్తి గణేష్ ఎంపికయ్యాడు. వీరు ఈ నెల 19వ తేదీ నుండి మూడు రోజులు పాటు గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థులను కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కళాశాల సిబ్బంది అభినందించారు.