విజయవాడ

రెండు రూపాల్లో దుర్గమ్మ అభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 19: దసరా మహోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున దుర్గమ్మ రెండు విశిష్టమైన అలంకారంతో భక్తులతో దివ్య దర్శనం ఇచ్చింది. ఈఅమ్మవార్లను దర్శనం చేసుకుని తరించటానికి భక్తులు రెండు పూటలా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. గురువారం వేకువ జామున 3గంటల నుండి ఉదయం 11గంటల వరకు శ్రీ మహిషాసుర మర్దనీ దేవి అలంకారంతో, మధ్యాహ్నం సుమారు 1గంట నుండి శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంతో ఉన్న దుర్గమ్మను భక్తులు దివ్య దర్శనం చేసుకున్నారు. అష్ట భుజాలను ధరించి సింహానాన్ని వాహనం చేసుకుని దుష్టుడైన మహిషాసురుడిని సంహరిస్తున్న మహిషాసురమర్దనీ అలంకారంతో ఉన్న దుర్గమ్మను భక్తులు దర్శనం చేసుకుని తరించారు. అలాగే సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తూ చెరుకుగడను వామహస్తాలు ధరించి దక్షిణ హస్తంతో ఆభయాన్ని ప్రసాదిస్తున్న శ్రీ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణీగా ఉన్న శ్రీ చక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరరీదేవిని కూడా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాల్లో చివరి రోజున భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతోపాటు, 13 జిల్లాల నుండి భక్తులు వచ్చారు. భక్తుల రద్ధీ అధికంగా ఉండటంతో ఈవో వీ కోటేశ్వరమ్మ అంతరాలయం దర్శనం రద్దు చేసి అందరికీ లఘు దర్శనం మాత్రమే ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ మల్లిఖార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో 9వ రోజున రెండు బ్యాజ్‌లు కలిసి సుమారు 300 మంది దంపతులు, చండీహోమంలో 150 దంపతులు మొత్తం 450 మంది దంపతులు పాల్గొన్నారు. ఈప్రత్యేక పూజల్లో దేవదాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూజల తర్వాత వీరికి ఈసెక్షన్ పర్యవేక్షణాధికారి ఎన్ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ప్రసాదాలను అందచేసి ఒక ప్రత్యేక క్యూమార్గం ద్వారా దర్శనం చేయించారు. కెనాల్ రోడ్‌లోని వినాయకుని గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి ప్రవేశించి రథం సెంటర్, శ్రీ విజయేశ్వర స్వామివారి దేవస్థానం, దుర్గా ఘాట్, మీదుగా టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి ఘాట్‌రోడ్ మార్గం గుండా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకు రాధాకృష్ణుల విగ్రహం వద్ద సిబ్బంది అప్పం, కుంకుమ ప్రసాదం భక్తులకు ఉచితంగా పంపిణీని చేశారు. తర్వాత భక్తులు మల్లిఖార్జున స్వామినని దర్శనం చేసుకొని మెట్ల మార్గం గుండా కనకదుర్గనగర్‌కు చేరుకున్నారు. ప్రసాదాల కౌంటర్ వద్ద లడ్డూ, పులిహార కొనుగోలు చేసి ఎదురుగా ఉన్న నిత్యాన్నదాన కేంద్రంలో సుమారు 15వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వేకువ జామున 3గంటల నుండే అన్ని క్యూమార్గాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో పోలీసులు, సేవాసంస్థల కార్యకర్తలు, విధులు నిర్వహించటంలో నిమగ్నయ్యారు. భక్తుల రద్ధీ మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. కేవలం సుమారు అర్ధగంటసేపు కొంతమేరకు తగ్గింది. తర్వాత క్రమంగా పెరిగి రాత్రి 10-30గంటల వరకు కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దుర్గాఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరికొంతమంది భక్తులు కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఎన్‌సీసీ విద్యార్థులు క్యూమార్గాల్లోని భక్తులు, వివిధ సెంటర్‌లో భక్తులకు నిరంతరం వాటర్ ప్యాకెట్‌లను సరఫరా చేశారు.

బడ్డీ ఆక్రమణలకు వీఎంసీ చెక్
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 19: నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న బడ్డీకొట్ల ఆక్రమణలకు వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెక్ పెట్టారు. రోడ్డు మార్జిన్ స్థలాలను ఆక్రమించి ఇటు ట్రాఫిక్‌కు అవరోధమే కాకుండా నగర సుందరీకరణకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఆక్రమిత బడ్డీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా బడ్డీల తొలగింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం, ప్రకాష్‌నగర్ నగర్‌లోని నూజీవీడు రహదారి పక్కన ఏర్పాటు చేసిన బడ్డీలను శుక్రవారం ఉదంయం తొలగించారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి రైతు బజార్ వరకూ ఇష్టానుసారంగా ఉన్న బడ్డీ వ్యాపారాలను నిలువరించే క్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ శారద నేతృత్వంలో అక్రమ ఆక్రమణల నిర్మూలనా దళం సిబ్బంది పొక్లైనర్లతో బడ్డీలను చెల్లాచెదురు చేశారు. ఇదిలావుండగా స్థానిక నేతలు తమ రాజకీయ ప్రాపకం కోసం బడ్డీలను ఏర్పాటుచేయిస్తున్నారు. పోటా పోటీగా రోడ్డు పొడవునా పలు బడ్డీలు ఏర్పాటయ్యాయి. ఏర్పాటైన బడ్డీలలో పచ్చ బడ్డీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.