విజయవాడ

సీఎం పదవి యావ తప్ప జగన్, పవన్‌లకు ప్రజల కష్టనష్టాలు పట్టవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 19: జగన్, పవన్‌లకు ముఖ్యమంత్రి పదవి యావ తప్ప ప్రజల కష్టనష్టాలు పట్టవని రాష్ట్ర న్యాయ, క్రీడశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. శుక్రవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టి, ఉద్ధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలిగారని పేర్కొన్నారు. విపత్తు సమయంలో స్పందించాల్సిన కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ పార్టీ కార్యాలయం శంకు స్థాపనకు వచ్చి విపత్తు ప్రాంతంలో పర్యటించకుండా మొఖం చాటేశారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పక్కజిల్లాలో పాదయాత్రలో ఉండి బాధితులను పరామర్శించలేదని, బడుగు, బలహీన వర్గాల వారికి నష్టం జరిగితే ప్రతిపక్షనేత పట్టించుకోవటం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో స్వార్ధ రాజకీయాల కోసం ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నాడన్నారు. ఉద్ధానంలో విపత్తు సంభవిస్తే పవన్‌కళ్యాణ్ రాజమండ్రిలో కవాతులో పాల్గొన్నారన్నారు. వీరు ఇద్దరి ఎజెండా సీఎం పదవే కానీ ప్రజల కష్టాలు కాదన్నారు. బడుగు, బలహీనవర్గాల్లో ఆత్మస్థైర్యం నింపిన నేత చంద్రబాబు అన్నారు. జీవిఎల్ తోకలేని కోతి అన్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు జీవిఎల్‌కు ఎంపీ పదవి దొరికిందని ఎద్దేవా చేశారు. బీజేపీ కక్షసాధింపు చర్యలకు ఐటీ దాడులే నిదర్శనమని, ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మొదలైన తర్వాతే ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో తమిళనాడులో రాజకీయ పట్టుకోసం ఐటీదాడులు చేశారని, కర్ణాటక ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిగాయని, నేడు ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇవి రాజకీయ కక్షసాధింపులకు నిదర్శనం కావా అని ప్రశ్నించారు.

వైభవంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
ఉయ్యూరు, అక్టోబర్ 19: తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఆశ్వయుజ శుద్ధ దశమి పర్యదినం సందర్భంగా విజయదశమి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించుకున్నారు. కొన్ని దేవాలయాల్లో గురువారం రాత్రితోనే నవరాత్రి ఉత్సవాలు ముగియగా, కొన్ని చోట్ల శుక్రవారం కూడా విజయదశమి వేడుకలు నిర్వహించారు. ఈ తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు, చివరి రోజు రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు సాక్షాత్కరించారు. చివరి రోజు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మండలంలోని గండిగుంట దత్తాశ్రమంలో చివరి రోజు ప్రత్యేక చండీయాగాన్ని, పూజలను చేసారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.

జనబాట ప్రారంభించిన జనసేన నాయకులు
నందిగామ, అక్టోబర్ 19: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అనాసాగరం ఆంజనేయస్వామి వారి ఆలయంలో గురువారం జనసేన నాయకులు తోట సాయి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జన బాట కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న యాత్ర విజయవంతం కావాలని, 2019 ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. నేటి నుండి ప్రతి వార్డులో పర్యటించి జన బాట కార్యక్రమాన్ని నిర్వహించి పవన్ కల్యాణ్ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షలు, నియోజకవర్గంలో 3వేల జన సైనికుల ఓట్లు తొలగించారని అన్నారు. తీసి వేసిన ప్రతి ఓటు మళ్లీ నమోదు చేయించుకుంటామని అన్నారు. కొత్త ఓట్లు నమోదు ప్రక్రియ కూడా జరుగుతుందన్నారు. జన సైనికుల ఓట్లు తొలగింపుపై దృష్టి పెట్టకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట మురళీకృష్ణ, కామిశెట్టి వెంకటేశ్వరరావు, నలగొండ మురళి, రామిరెడ్డి వీరబాబు, బద్రి, కుమ్మరి రాజేష్, తాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.