విజయవాడ

శ్రీకాకుళంలో ఇంటింటి కుళాయికి రూ.120కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, అక్టోబర్ 19: చారిత్రక పుణ్యక్షేత్రం శ్రీకాకుళం గ్రామంలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు పథకానికి రూ.120 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. శుక్రవారం ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. 2019 జనవరి 2వ తేదీ నుండి జరిగే జన్మభూమి కార్యక్రమంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్‌లు అందించనున్నట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటి వరకు మూడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించగా నూరు శాతం సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. చెత్త నుండి సందప తయారీ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఇంటింటికీ 10 మొక్కలు చొప్పున నాటి సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. నియమాలు పాటిస్తూ ఆహారంలో తృణ ధాన్యాలు ఉండేలా చూడాలన్నారు. జపాన్‌లో జీవిత కాలం అధికంగా ఉంటుందన్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెండ్లి కానుక, ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, అవసరమైన పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మహిళ సంక్షేమ శాఖ ద్వారా గ్రామంలో నలుగురు గర్భిణీలకు సీమంతం నిర్వహించగా కలెక్టర్ ఆశీర్వదించారు. రైతు రథం పథకం కింద ఇద్దరు రైతులకు కలెక్టర్ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. తొలుత ఆది ఆంధ్ర మహావిష్ణువు శ్రీ కాకుళేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌కు ఆలయ ఎసీ శారదా కుమారి ఆధ్వర్యంలో అర్చక బృందం, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అందే సూర్య భవానీ జెడ్పీటీసీ తుమ్మల వరలక్ష్మీ, ఎఎంసీ చైర్మన్ తుమ్మల చౌదరిబాబు, మండల ప్రత్యేక అధికారి నారాయణరావు, ఎంపీడీఓ రామ్‌కుమార్, తహశీల్దార్ సుధారాణి, ప్రత్యేక అధికారి బావోజీరావు, ఇఓ నాగమణి, ఎంఇఓ సుబ్బారావు, హౌసింగ్ ఎఇ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన దసరా సంబరాలు
మైలవరం, అక్టోబర్ 19: దసరా సంబరాలు మైలవరంలో గురువారం రాత్రి అంబరాన్ని తాకాయి. సంబరాల నిర్వహణలో రెండు మూడు గ్రూపులు పోటీపడి కార్యక్రమాలను, గ్రామోత్సవాలను నిర్వహించటంతో మైలవరంలో రాత్రంతా సందడి నెలకొంది. భక్తులు, ప్రజలు, సంబరాలను తిలకించేందుకు రాత్రంతా జాగారం చేశారు. ద్వారకా తిరుమలకు దత్తత దేవాలయమైన మైలవరంలోని శ్రీ కోట మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న 58వ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. గత తొమ్మిది రోజులుగా రోజుకొక అవతారంతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు చివరి రోజైన గురువారం మహిషాసుర మర్ధని, శ్రీ రాజరాజేశ్వరి అవతారాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం సమయంలో బేతాళ ప్రదర్శన, ఊరేగింపుతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారిని ప్రత్యేక రధంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ దేవతామూర్తుల వేషధారణలతో కోలాటం, కనకతప్పెట్లు, తీన్‌మార్ బ్యాండు, బుట్టబొమ్మలు, శక్తిపటాలు, పొడుగుకాళ్ళ మనుష్యుల విన్యాసాల మధ్య గ్రామోత్సవం అంబరాన్ని తాకింది. మరో వైపు శ్రీ దుర్గామోటార్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, మరో వైపు శ్రీ దుర్గ్భావాని టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో విడివిడిగా పోటీ పడి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామోత్సవాలు తెల్లవార్లు కొనసాగాయి. భక్తులు సైతం అమ్మవారిని, దేవతామూర్తుల వేషధారులను తిలకించేందుకు రాత్రంతా రోడ్లపై జాగారం చేశారు.
దసరా సంబరాల్లో ప్రముఖులు
దసరా సంబరాల్లో ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కాజా రాజ్ కుమార్ తదితరులు మూడు ప్రాంతాలలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పోటీపడి మరీ కార్యక్రమాలను విజయవంతం చేశారు.