కృష్ణ

‘ఎన్నికల నాయకులను’ ఎండగట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, అక్టోబర్ 23: ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలకు మాయమాటలు చెప్పి గెలవాలని గ్రామాల్లోకి వస్తున్న అవినీతి పరులకు గడ్డిపెట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి, సమన్వయ కమిటీ సమీక్షా సమావేశం ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం అర్థరాత్రి వరకూ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ ఎన్నికల దొంగలకు ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు. ఎటువంటి లబ్ది లేకపోతే నాలుగున్నరేళ్ళ పాటు పార్టీ సభ్యత్వం తీసుకోకుండా తెలుగుదేశం పంచన ఎందుకున్నారో ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడైన ఉన్నపార్టీలో సభ్యత్వం ఉందో లేదో నిలదీయాలన్నారు. గోడమీద పిల్లులు, అవకాశవాద రాజకీయాలు నడిపే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నియోజకవర్గ సమన్వకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ)ను ఉద్దేశించి అన్నారు. పసుపు చొక్కా వేసుకుని ఆత్మగౌరవం ప్రదర్శించాల్సిన నేతలు అవకాశవాద రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. దశాబ్దాలపాటు ఎవరూ చేపట్టని 22 ఎత్తిపోతల పధకాలను 28.82 కోట్ల రూపాయలతో మేమే చేపట్టామని స్పష్టం చేశారు. దీనిని ప్రజలలోకి వెళ్ళి తెలియజెప్పాలని సూచించారు. ఎత్తిపోతల పధకాల మరమ్మతులకు 9490959969 అనే నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో లక్షలాది రూపాయల విలువ చేసే ఏడు వేల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశామని, ఇంకా మిగిలిన వారందరికీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ రావాల్సిన సమయానికి నెల రోజుల ముందే సాగరు జలాలను రప్పించామని గుర్తు చేశారు. రైతులందరికీ సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన పనులే కాకుండా అందరికీ అవసరమైన చెప్పని పనులను కూడా చేశామన్నారు. ఒడ్డున కూర్చుని రాళ్ళు వేసే వారిని కనిపెట్టి తగిన బుద్ధి చెప్పాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈసమావేశంలో పలు శాఖల అధికారులతో ఇప్పటి వరకూ ఆయా శాఖ ద్వారా జరిగిన అభివృద్ధిని చెప్పించారు. మిగిలిన, జరగాల్సిన అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈకార్యక్రమంలో మైలవరం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

నవంబర్ మొదటి వారంలో‘పోర్టు’కు నిధులు
* కలెక్టర్ లక్ష్మీకాంతం
మచిలీపట్నం, అక్టోబర్ 23: బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల కొనుగోలుకు అవసరమైన నిధులు నవంబర్ మొదటి వారంలో రానున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు, భూముల సేకరణ, పనుల ప్రారంభంపై మంగళవారం కలెక్టర్ విజయవాడలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు పథకం కింద రైతులకు ఎకరానికి రూ.25లక్షలు పరిహారంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులను నవంబర్ మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలిపారు. నిధులు వచ్చిన తర్వాత రెండవ వారంలో భూమి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. నెలాఖరు లోపు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు, ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ జె ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.