క్రైమ్/లీగల్

నగరంలో మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, నవంబర్ : నగరంలో గుట్టు చప్పడు కాకుండా మత్తు ఇంజక్షన్ల విక్రయాలకు సంబంధించిన ముఠాను ఆదివారం టాస్క్‌పోర్సు ఏసీపీ రాజీవ్ పర్యవేక్షణలో అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టాస్క్‌పోర్సు ఏసీపీ రాజీవ్ కుమర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు, కూలిపని చేస్తూ జీవనం సాగించే వారిని ఎంచుకొని వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 30 ఎంజి పోర్ట్‌విన్ ఇంజక్షన్లు-75, రూ 7,480 నాలుగు సెల్‌పోన్‌లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన విశ్వరూప్ బారిక్ (36) అనే వ్యక్తి సుమారు 13 సంవత్సరాల క్రితం బతుకుతెరువు నిమిత్తం విజయవాడ వచ్చి, ప్రస్తుతం గత 6నెలలుగా అరండల్‌పేటలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన తంగళ్ల హరికృష్ణ అనే వ్యక్తి ఇద్దరు కలిసి గత కొంత కాలంగా 30 ఎంజి పోర్ట్‌విన్ పేరుతో మత్తు ఇంజక్షన్లు ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి, అరండల్ పేట కాల్వగట్టుపై నివాసం ఉంటున్న కందుకుట్ల నాగమణి (60) అనే మహిళకు విక్రయిస్తున్నారన్నారు. ఒక పోర్ట్ విన్ ఇంజక్షన్ అసలు ధర 5.30 పైసలు కాగా నాగమణికి దీనిని 100 రుపాయలకు విక్రయిస్తున్నారన్నారు. దానిని నాగమణి 2 రూపాయలకు విక్రయిస్తుందని తెలిపారు. నాగమణి ఇంటి వద్ద చిట్టినగర్‌కు చెందిన పిళ్లా మహేష్‌కుమార్ (31) పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన పైడి దీపక్ (36) అనే వ్యక్తులు ఈ ఇంజక్షన్లు కోనుగోలు చేయిస్తున్నారన్నారు. పోర్ట్‌విన్ ఇంజక్షన్ సాధరణంగా రోగులకు శస్త్ర చికిత్సలు చేసే సమయంలో, మానసిక రోగులకు వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిర్ధారిత వైద్యుల ప్రిస్‌క్రిప్షన్ లేకుండా ఈ ఇంజక్షన్లు విక్రయించటం కోనుగోలు చేయటం కూడా చట్టరీత్యా నేరం అన్నారు. ఈ మత్తు ఇంజక్షన్లుకు అలవాటు పడిన వ్యక్తులు వీటి ప్రభావం కారణంగా కొంత కాలానికి అనారోగ్యానికి గురవటమే కాకుండా ప్రాణపాయ పరిస్థితికి వస్తారన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రమైన విచారణ జరిపించి మత్తు ఇంజక్షన్లు ఎక్కడ, ఎవరి నుండి కోనుగోలు చేశారో అనే సేకరించి మిగతా నిందితులను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌పోర్సు ఇన్స్‌పెక్టర్ సురేష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.