విజయవాడ

టీడీపీ ప్రభుత్వంతోనే బాలలకు బంగారు భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: బాలల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమం, మహిళా సాధికారిత, సెర్ప్ శాఖల మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం స్ర్తి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాలల దినోత్సవ వేడుకల్లో మంత్రి పరిటాల సునీత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘బడి పిలుస్తోంది, బడికి వస్తా’, ‘మన ఊరు - మన బడి’ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిందన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే దిశగా పాఠశాలలు పది రోజుల ముందు నుంచే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారన్నారు. అలానే ఆడ పిల్లలకు చిన్న వయస్సులోనే బాల్య వివాహాలు చేయకుండా వారికి మంచి చదువును అందించే విధంగా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం, మధ్యాహ్న భోజనం, ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్నామన్నారు. బడికి వెళ్లాల్సిన బాలలను కార్మికులుగా పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ శాంతి, కరుణకు ప్రతిరూపంగా బాలల దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్‌పర్సన్ జీ హైమావతి మాట్లాడుతూ బాలలు స్వేచ్ఛగా జీవించడానికి, అభివృద్ధి చెందడానికి ఆహారం పొందడానికి హక్కులు కలిగి ఉన్నారని, వాటిని వారికి అందించేలాగా కమిషన్ ఆవరి వెంట ఉంటుందన్నారు. మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమ శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ బాలల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవ వేడుకలు - 2018ను ప్రారంభించి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోటీల్లో విజేతలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాలబాలికలు పాల్గొన్నారు.