విజయవాడ

జగన్, పవన్‌లను శాసిస్తున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 14: బీజేపీ హిందువుల పార్టీకాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సర్ట్ఫికెట్ ఇవ్వడం రెండు పార్టీల లాలూచీకి నిదర్శనమని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. హిందువుల పార్టీ కాదని బీజేపీతో కలుస్తానని పవన్ ఎందుకు చెప్పటంలేదని విమర్శించారు. బీజేపీతో కలవని విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. జాతీయ స్థాయిలో తన వైఖరిని పవన్ ఎందుకు ప్రకటించరని బుధవారం ఒక ప్రకటనలో యనమల ప్రశ్నించారు. బీజేపీ, పవన్ సంబంధాలపై స్పష్టతలేదని నేరుగా సమాధానం చెప్పటంలేదని వ్యాఖ్యానించారు. బీజేపీని వెనకేసుకువస్తున్న పవన్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడరన్నారు. ప్రధాని మోదీని విమర్శించే ధైర్యం వైసీపీ అధినేత జగన్, పవన్‌లకు లేదన్నారు. కేంద్రాన్ని నిధులడిగే దమ్ము కూడా లేదన్నారు. పోలవరానికి నిధులివ్వకపోతే ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. కడప స్టీల్‌ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ ఊసెత్తకపోవటంలోని ఆంతర్యమేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పునర్విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేసే ధైర్యం ఉందో లేదో తేల్చాలన్నారు. కోడికత్తిపై ఫిర్యాదు ఇవ్వడం బాధితుడిగా జగన్ బాధ్యత అని ఫిర్యాదు లేకుండా హైదరాబాద్‌కు పంపింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నారు. 19 రోజులైనా జగన్ దానిపై ఎందుకు నోరుమెదపరని నిలదీశారు. దీనిపై రాష్టప్రతికి ఎలా ఫిర్యాదు చేస్తారన్నారు. థర్డ్‌పార్టీ ఎంక్వయిరీ ఎలా జరుగుతుందన్నారు. విశాఖలో ఫిర్యాదు లేకుండా ఢిల్లీ వెళ్లి రాష్టప్రతికి ఫిర్యాదు చేయటం హాస్యాస్పదమన్నారు. నవ్విపోదురు కాక మాకేటి సిగ్గు అనే చందంగా వైసీపీ నేతల వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అప్రతిష్ట తేవటమే పనిగా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం గురించి పవన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఉన్న ధైర్యమేమిటో దేశం మొత్తానికి తెలుసన్నారు. పవన్ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదన్నారు. జగన్ ధైర్యంపై పవన్ ప్రశ్నిస్తే వైకాపా నోరు తెరవదన్నారు. అసెంబ్లీకి గైర్హాజరుపై పవన్ ప్రశ్నిస్తే వైసీపీ వౌనం వహిస్తుందని అక్కడే ఈ మూడు పార్టీల లాలూచీ అర్థమవుతుందన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పవన్ విమర్శలపై వైసీపీ స్పందించటంలేదో ప్రజలకు తెలుసన్నారు. పవన్‌పై విమర్శలు చేయొద్దని మోదీ, అమిత్‌షా వైసీపీని శాసించి ఉండవచ్చన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు చేస్తోందని ఈ కుట్రలో జగన్, పవన్ పాత్రదారులయ్యారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు.