విజయవాడ

అవినీతి పునాదులపై పుట్టినదే వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 15: అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని జనసేన పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ డేవిడ్ రాజు, జాయింట్ కో ఆర్డినేటర్ పోతిన మహేష్‌లు విమర్శించారు. వాస్తవాలు మాట్లాడితే వైకాపా నాయకులకు అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. నగరంలో భారతీనగర్‌లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిపక్షనేతగా విఫలమైన వైఎస్ జగన్ గురించి వాస్తవాలు మాట్లాడితే వైసీపీ నేతలు కలవర పాటుకు గురతున్నారని తెలిపారు. అవినీతితోనే వైసీపీ అవిర్భవించిందన్న విషయంలో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు. ప్రశ్నించడానికే పుట్టిన జనసేన పార్టీ తరుఫున వాస్తవాలను ప్రజలకు వివరించే క్రమంలో వాటిని అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారన్నారు. పవన్‌ను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లేనన్నారు. ప్రధాన ప్రతిపక్షనేతగా విఫలమైన జగన్‌కు కలలు కంటున్న సీఎం ఎప్పటికీ దక్కదన్నారు. మరో ఐదు సంవత్సరాలు పాదయాత్ర చేసేందుకు ఇప్పటి నుండి జగన్ ప్రణాళిక రచించుకోవాలన్నారు. జగన్ సోదరి షర్మిల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పటికీ ప్రయోజనం లభించలేదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. జగన్ జైల్లో ఉన్నపుడు వారి కుంటుంబాన్ని, వ్యాపారాలను సమర్థవంతంగా నడిపిన భారతిని కూడా కాదని అవినీతి పాలనలో విజయసాయిరెడ్డిని పార్టీలో నెంబర్ 2గా చేయడం చూస్తుంటే జగన్‌కు అవినీతి పట్ల అధికారం పట్ల ఉన్న మక్కువ అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షనేతగా జగన్ విఫలం కావడంతోనే పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలను రాష్ట్రంలో తీసుకున్నారని చెప్పారు. దీని కారణంగానే ప్రధాన సమస్యలపై అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. నేటికీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సజీవంగా ఉన్నాయంటే అది పవన్ కళ్యాణ్ పోరాట ఫలితమేనన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు నెరుసు కృష్ణ అంజనేయులు, కే రాము తదితరులున్నారు.