విజయవాడ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 16: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతికి అనుమతి లేదని, ఏపీ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మాత్రమే సీబీఐకి సాధారణ సమ్మతి ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం సీబీఐలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుందని తెలిపారు. ఢిల్లీ కోర్టు తీర్పు ప్రకారం సీబీఐ ఎక్కడినుంచైనా దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సీబీఐ తనంత తానుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం లేదన్నారు. సంబంధిత రాష్ట్రాల వినతి మేరకే కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చని ఆ చట్టంలో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం సాధారణ సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం వల్ల రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసేందుకు వీలు లేకుండా పోయిందన్న విమర్శలు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే, కేంద్రం కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చన్నారు. సుప్రీం కోర్టు ఆదేశిస్తే, ఏ రాష్ట్రాలూ సీబీఐ దర్యాప్తునకు అడ్డు చెప్పలేవన్నారు. బీజేపీ పాలిత చత్తీస్‌గఢ్, హర్యానా,హిమాచల ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి లేదన్నారు. సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొందన్నారు. దీనిపై ఎంపీ జీవీఎల్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఏపీ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం సీబీఐలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ సంస్థ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో 60 శాతం మాత్రమే శిక్షలు పడ్డాయన్నారు. సాధారణ సమ్మతి ఉపసంహరణ వల్ల రాష్ట్రంపై దొంగ కేసులు నమోదు చేసే అవకాశం సీబీఐకి ఉండదన్నారు.