విజయవాడ

జగన్ కేసులో వాస్తవాలు కప్పిపుచ్చేందుకే సీబీఐపై కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 16: రాజధాని నిర్మాణంలో అవినీతి, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అక్రమా లు, ఇసుకదోపిడీ మైనింగ్ అగ్రిగోల్డ్, విశాఖ కుంభకోణాలు, కాల్‌మనీ, తుని రైలు సంఘటనలన్నింటిపీ వైసీపీ సీబీఐ విచారణ కోరుతూనే ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకోసం, ఎవరిని కాపాడటం కోసం టీడీపీ ప్రభుత్వం సీబీఐని రా ష్ట్రంలోనికి రాకుండా అడ్డుకుంటుందో చెప్పాలన్నారు. వ్యవస్థలను గౌరవించని వాళ్లు ప్రజాస్వామ్యంలో అసలు పనికిరారన్నారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌పై జరిగిన హత్నాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. సీబీఐ కానీ ఏదైనా స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిగితే చంద్రబాబు కుట్ర బయటపడుతుందన్నారు. దొరికి పోతారనే భయంతోనే సీబీఐని అడ్డుకునేందుకు అన్యాయమైన జీవో నెంబర్ 176ను తీసుకు వచ్చారన్నారు. ఆగస్టు 9న సీబీఐకి రాష్ట్రంలో ఏ విచారణ అయినా జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చి జీవో జారీ చేసి ప్రస్తుతం తాజాగా దానిని ఉపసంహరించుకుంటూ మరో జీవోను తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రంలో సంచలనాలు కలిగించిన రాజకీయ పరిణామాలు జరిగిన నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. జగన్‌పై జరిగిన హత్నాయత్నం ఘటనలో తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థతో దర్యాప్తు చేస్తే కుట్రదారులు, సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం లేదని భావించడంతోనే హైకోర్టును వైకాపా ఆశ్రయించిందన్నారు. తరువాత రాష్టప్రతి, గవర్నర్లను కలిసి నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని కోరామన్నారు. ఈ కేసులో సీఎం, డీజీపీలు ప్రధాన కుట్రదారులుగా ఉన్నందున తమకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని వ్యవస్థలను మేనేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సీబీఐపై చంద్రబాబు అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు గాని లోకేష్‌కు గాని విచారణను ఎదుర్కొనే దమ్ముందా సవాలు విసిరారు. కేంద్రంపై పోరాడుతున్నానని చెబుతున్న చంద్రబాబు సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు.