విజయవాడ

దుర్గమ్మ సేవలో హైకోర్టు జస్టిస్, చీఫ్ సెక్రటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, నవంబర్ 18: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మను ఆదివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆశీర్వాద మండపంలో అర్చకులు జస్టీస్‌కు దివ్య ఆశీస్సులను అందచేయగా సహాయ ఈవోసాయిబాబా అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఇదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠా అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అర్చకులు దివ్య ఆశీస్సులను అందచేయగా, సహాయ ఈవో సాయిబాబా అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా వీరికి ఈవో కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన రవి, సూర్య యంత్ర దీపార్చనలో సతీష్ చంద్ర దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించుకుని స్వయంగా దీపాలు వెలిగించారు. ఈకార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.

నేడు భవానీ దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి, నవంబర్ 18: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం 7-30గంటలకు ఈదీక్షలు ప్రారంభం కానున్నాయి. 41రోజుపాటు దీక్షలు ఆచరించే భక్తులు సోమవారం నుండి దీక్షలు స్వీకరించవచ్చు. శ్రీ మల్లిఖార్జున మహామండపంలో 6వ అంతస్తులో నిర్వహించే ఈకార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధికంగా విచ్చేసి దీక్షలను స్వీకరించి ఆమె కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈవో కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఆకట్టుకున్న హ్యాపీ సండే
లబ్బీపేట, నవంబర్ 18: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్డు దగ్గర ప్రతి ఆదివారం నిర్వహించే హ్యాపి సండే కార్యక్రమం ప్రజలను ఆనందడొలికలతొ నింపింది. సన్‌షైన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారి పర్యవేక్షణలో పిట్‌జి కళాశాల, ఆక్స్‌పోర్డ్స్ స్కూల్ విద్యార్ధులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద కళలు మాయమైరిపించాయి. బబ్లు అండ్ టీం వారు నిర్వహించిన డాన్సులు ప్రజలను ఉర్రూతలుగించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్‌శాఖ కృష్ణాజిల్లా వారి ఆధ్వర్యంలో స్వైన్‌ప్లూ వ్యాధి నివారణకై ఉచిత మందుల పంపిణి కార్యక్రమం నిర్వహించటంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అదే విధంగా వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, త్రో బాల్‌తో పాటుగా పలు క్రీడ పరికరాలను అందుబాటులో ఉంచడంతో ప్రజలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ శేఖర్, ఫైర్, బాషా సాంస్కృతిక శాఖధికారులు, ఫిట్‌జి, ఆక్స్ఫ్‌ర్డ్ స్కూల్ యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు.