విజయవాడ

కిటికిటలాడిన కృష్ణాతీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 18: రయ్... రయ్... రయ్ మంటూ హోరెత్తించే శబ్దాలతో ఫార్మూలా వన్ బోట్లు కృష్ణానదిలో దూసుకు వెళ్తుంటే అభిమానులు డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫార్ములా వన్ హెచ్ 2 వో పవర్ బోట్ రేసింగ్ పోటీల్లో భాగంగా నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద లక్ష మంది ప్రేక్షకులు కోలాహలం కనిపించింది. వీక్‌ఎండ్‌లో ఆహ్లాదం పంచే విధంగా నిర్వహించిన ఈ పవర్ బోట్ పోటీలను తిలకించేందుకు నగర వాసులు ఎంతో ఉత్సాహం చూపించారు. వీరిని ఆహ్లాద పరుస్తూ ఫార్ములా వన్ బోట్ డ్రైవర్లు ఇచ్చిన ప్రదర్శన అందరినీ అబ్బుర పరిచింది. గత మూడు రోజులుగా కృష్ణానది తీరంలో నిర్వహిస్తున్న ఫార్ములా వన్ రేసింగ్ పోటీలను ఆదివారంతో ముగిసాయి. ఆదివారం తుది పోటీలకు సంబంధించి గంట పాటు నిర్వహించిన పోటీల్లో రేసింగ్ బోట్లు కృష్ణానదిలో గంటకు 260 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీసుంటే అభిమానులు ఆసక్తిగా తిలకించారు. కనక దుర్గమ్మ వారధి వద్ద సుమారు 10 వేల మంది తిలకించే విధంగా, ఎన్టీఆర్ సాగర్ తీరంలో మరో 40 వేల మంది పోటీలను చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతం భవానీ ఘాట్ వరకు అభిమానులు చేరుకుని పోటీలను ప్రత్యక్షంగా చూశారు. ఏడు దేశాలు పాల్గొంటున్న ఈ ప్రపంచ స్థాయి పోటీలకు సంబంధించి నిర్వహించిన తుది పోటీలను తిలకించేందుకు చిన్నా, పెద్ద, తేడా లేకుండా తరలివచ్చారు. ప్రజాప్రతినిధులు సైతం పోటీలను చూసేందుకు పున్నమిఘాట్‌కు పోటెత్తడం విశేషం. తుది పోటీల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా లక్ష మంది పరోక్షంగా కోట్ల మంది అభిమానులు చూసేవిధంగా ఏంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ టూరిజం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల్లో భారత దేశం తరుపున పాల్గొన్న అమరావతి టీంకు మద్దతు తెలిపేందుకు అందరూ ఉత్సహం చూపించారు. పోటీల్లో పాల్గొనే ఒక్కొక్క బోట్ విలువ సుమారు రెండు నుండి మూడు కోట్ల రూపాయలు కాగా, అమరావతికి ప్రాతినిథ్యం వహిస్తున్న పోటీలకు యుఐఎం బోట్లను ఉచితంగా అందించింది. ఇప్పటికీ మన దేశానికి సంబంధించి సొంత బోట్లు లేని మన క్రీడాకారులు గతంలో జరిగిన పోటీల మాదిరిగానే అద్దె బోట్లతో పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీలు అమరావతిలో నిర్వహిస్తున్న క్రమంలో యుఐఎం బోట్లను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతి టీంను ఉత్సాహ పరిచేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోటీలు ఆద్యంతం అమరావతి టీమ్ విరోచిత ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో వారిని ప్రోత్సహించేందుకు నగర వాసులు పోటీ పడ్డారు. అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో పోటీ నుండి అమరావతి బోట్ వెనుదిరగడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అమరావతి వేదికగా కృష్ణానదిలో నిర్వహించిన ఈ ఫార్ములా వన్ పోటీలు నగరానికి కొత్త శోభను తీసుకు వచ్చాయి.