విజయవాడ

అరకు కాఫీ తరహాలో 500 ఉత్పత్తులకు బ్రాండింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: అరకు కాఫీ తరహాలో 500 ఉత్పతులను బ్రాండింగ్ చేసేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ, నాంది ఫౌండేషన్, ఆ శాఖ అధికారులతో సోమవారం ఆయన ఏపీలో రూరల్ బ్రాండ్స్ అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో 500 ఉత్పత్తులను మేడ్ ఇన్ ఏపీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు వీలుగా కావాల్సిన ప్రోడక్ట్ డిజైన్ సహకారం, మార్కెటింగ్, పెట్టుబడి తదితర అంశాల్లో సహకారం అందించేందుకు వీలుగా విధానాలు రూపకల్పన చేయాలన్నారు. లోకల్ బ్రాండ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు, గిరిజనులు, రైతులు, కళాకారులు, చేనేత కార్మికులు దాదాపు రెండు లక్షల మందికి లబ్ధి చేకూరేలా కార్యక్రమం రూపొందించాలన్నారు. బ్రాండింగ్ తీసుకురావడం వల్ల తయారీదార్ల ఆదాయ