విజయవాడ

రాష్ట్రాల అధికారాలపై జైట్లీ వ్యాఖ్యలు విడ్డూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: రాష్ట్రాలకు సార్వభౌమాధికారంలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలు సమంజసంకాదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాల విధులపై స్పష్టత ఉందన్నారు. అన్నీ తెలిసి అరుణ్‌జైట్లీ తెలీనట్లు వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు సార్వభౌమాధికారాలు లేవనడం హాస్యాస్పదమని సోమవారం ఒక ప్రకటనలో యనమల ఖండించారు. అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ మాటలనే ఆయన వల్లెవేసినట్లు ఉందన్నారు. రాఫెల్‌పై కాగ్ నివేదికను పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టలేదో జాతికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వద్ద కూడా రహస్యాలు ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. కాగ్ నివేదికలో రాఫెల్‌పై చేసిన వ్యాఖ్యలేమిటో ప్రజలకు వివరించాలన్నారు. నివేదికను బహిర్గతంచేసే ధైర్యం కేంద్రానికి లేదన్నారు. అధికారుల పరస్పర కేసులతో సీబీఐని అప్రతిష్టపాల్జేశారని, ఈ నేపథ్యంలో సీబీఐకి సమ్మతి ఉపసంహరించామని తెలిపారు. ఉపసంహరణ నూరుశాతం సరైన చర్యే అన్నారు. ఐఆర్‌సీటీసీలో లాలూప్రసాద్‌ను కావాలనే ఇరికించారని, సీబీఐ ఉన్నతాధికారులు కేంద్రం చెప్పుచేతల్లో పనిచేస్తూ రాజకీయ వేధింపులకు పాల్పడే దురుద్దేశ్యంతోనే లాలూ ప్రస్తావన తెచ్చారన్నారు. ఇదే విషయాన్ని సీవీసీకి ఆలోక్‌వర్మ వాంగ్మూలం ఇచ్చారని గుర్తుచేశారు. నరేంద్రమోదీ కాలుష్యం ఢిల్లీని మించిందని విమర్శించారు. దాన్ని కడిగేందుకే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు. ఓట్ల కోసమే చాయ్‌వాలా అని మోదీ చెప్పుకున్నారని ఆచరణలో ఆయన కార్పొరేట్ వాలా అని ఎద్దేవా చేశారు. ధనవంతులకే ప్రధాని కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్యులరిజానికి ఆయన వ్యతిరేకమన్నారు. ఫాసిస్ట్ ధోరణితో వ్యవహరిస్తున్నారని అందుకే ప్రజాస్వామ్య వాదులను ఏకం చేస్తున్నట్లు చెప్పారు. మోదీ బారి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి యనమల స్పష్టం చేశారు.