విజయవాడ

పేదరికంపై గెలుపే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, నవంబర్ 19: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టీకరించారు. ఆదరణ-2 పధకం కింద ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఉమ మాట్లాడుతూ జిల్లాలో 2.23 లక్షల మంది బలహీన వర్గాల లబ్దిదారులకు 1189 కోట్ల రూపాయల విలువైన వివిధ రకాల పనిముట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మైలవరం మండలానికి 511 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. యూనిట్లను లబ్దిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటైన సభలో మంత్రి ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో సగం కన్నా ఎక్కువ శాతంగా ఉన్న బలహీన వర్గాలకు ప్రభుత్వ పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. అన్నింటా వారికి అవకాశాలు కల్పించి ముందుంచుతున్నామన్నారు. ప్రభుత్వ పరంగా వారికి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేసి వెచ్చించి పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వారికి అందిస్తున్న పనిముట్ల ఖరీదులో కేవలం 10శాతం మాత్రమే లబ్దిదారు వాటాగా నిర్ణయించి మిగిలిన 90శాతం నిధులను ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలిపారు. 10శాతం వాటాను కూడా ఆయా గ్రామాలలో నాయకులే భరించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన యూనిట్ల కన్నా లబ్దిదారులే తక్కువ మంది ఉన్నారని ఐనప్పటికీ అన్ని యూనిట్లు సద్వినియోగం అయ్యేటట్లు లబ్దిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్ని గ్రామాలలో బిసి భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పంపిణీలో వివిధ రకాల కుల వృత్తులకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి పనిముట్లను పంపిణీ చేశారు.
ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి
ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా ప్రజలకు జవాబుదారి తనంగా ఉండాలని మంత్రి ఉమ ఆదేశించారు. పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. పదవి ఉందని కొమ్ములు నెత్తికొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే తగిన సమాదానం చెబుతారన్నారు. ప్రజాసేవ చేసిన వారికి నిరంతరం ప్రజలు పట్టం కడుతూనే ఉంటారనే దానికి తానే ఒక నిదర్శనమన్నారు. అదేవిధంగా అధికారులు సైతం తమ పనులను చిత్తశుద్ధితో చేయాలని, ప్రభుత్వ పధకాలను పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు.
అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టండి
తాను నిరంతరం పేదల అభ్యున్నతికోసం కష్టపడుతుంటే కొందరు అభివృద్ధి నిరోధకులు అడ్డుకుంటున్నారని అటువంటి వారిని తరిమికొట్టండని మంత్రి ఉమ పిలుపునిచ్చారు. గతంలో తనపై పోటీ చేసి ఓడిపోయి తర్వాత తెలుగుదేశం పంచన చేరి డబ్బు సంపాదించి హత్య కేసులో, అక్రమ సంపాదన కేసులో నిందితుడిగా కొనసాగుతూ అక్రమ డబ్బుతో తనపై తాజాగా పోటీకి వస్తున్న వారిని తరిమికొట్టండని వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ను ఉద్దేశించి ఆయన పిలుపునిచ్చారు. తాను అభివృద్ధి చేస్తుంటే తనను ఎలా సాగనంపాలి, తనకు ఎలా గోరి కట్టాలనే కక్షతో వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారి ఆటలు మైలవరం ప్రజలు సాగనివ్వరని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి బాణావతు లక్ష్మి, జడ్పీటిసి రాము, ఏఎంసి చైర్మన్ ఉయ్యూరు నరశింహారావు, నేతలు శోభన్‌బాబు, మైలవరం, జి కొండూరు, రెడ్డిగూడెం మండలాలకు చెందిన అధికారులు, నేతలు పాల్గొన్నారు.