విజయవాడ

కృష్ణమ్మ ఒడిలో కార్తీక దీపారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, నవంబర్ 19: కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా 2వ కార్తీక సోమవారం వేకువ జామున పవిత్ర కృష్ణనదీ దీపకాంతులతో ధగధగలాడింది. 2వ సోమవారం కావటంతో వేకువజామునే మహిళలు దుర్గా ఘాట్‌కు వచ్చి భక్తి శ్రద్ధలతో అరటి దొప్పల్లో దీపారాధన చేసి వాటిని భక్తి ప్రపత్తులతో నదిలో విడిచి పెట్టారు. సోమవారం వేకువ జామునుంచే పోలీసులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. స్నానాలు ఆచరించటానికి వచ్చిన భక్తులను ఒక వరుస క్రమంలో ఘాట్‌లోకి అనుమతిస్తూ మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించటంతో భక్తులకు చాలావరకు వెసులుబాటు కలిగింది. వేకువ జామున 4గంటల నుండి ఉదయం 8గంటల వరకు ఘాట్‌లో భక్తుల రద్ధీ కనబడింది. పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తుల్లో కొంతమంది ఘాట్‌కు సమీప ప్రాంతాల్లోని శైవ పీఠాలకు వెళ్లి పరమేశ్వరునికి దర్శనం చేసుకొని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకున్నారు.