విజయవాడ

జిల్లాలో భూధార్ అమలు భేష్ * కలెక్టర్‌కు సీఎం అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: భూధార్ అమలుతో పాటు తాత్కాలిక భూధార్ కేటాయింపులు 94శాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ లక్ష్మీకాంతంను అభినందించారు. ఉండవల్లి ప్రజావేదికలో మంగళవారం రాష్టవ్య్రాప్త భూధార్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూధార్ అమలుతో పాటు 94శాతం తాత్కాలికంగా కేటాయించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపటం అభినందనీయమన్నారు. భూధార్‌ను పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో విజయవంతం చేసిన కలెక్టర్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈసందర్భంగా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో 13.86 లక్షల భూ విభాగాలు ఉన్నాయని, వీటిలో 13.02 లక్షల భూ విభాగాలకు ల్యాండ్ పార్శిల్స్ పూర్తి చేశామని తెలిపారు. వీటిలో పట్ట్భాములు 10.15 లక్షల విభాగాలకు, మిగిలిన 2.86 లక్షల విభాగాల ప్రభుత్వ భూమికి ల్యాండ్ పార్శిల్స్ పూర్తిచేసి తాత్కాలిక భూధార్ కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన వివరించారు.

‘నార్ల’ థర్మల్ కేంద్రానికి మరో బంగారు పతకం
* ఇది సమష్టి కృషి ఫలితం
* చీఫ్ ఇంజనీర్ (శిక్షణ) సత్యనారాయణ
ఇబ్రహీంపట్నం, నవంబర్ 20: నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో అధిక విద్యుత్ ఉత్పత్తి సాధిస్తూ ప్రమాద రహిత కేంద్రంగా పని చేస్తున్నందుకు గాను మూడోసారి గ్రీన్‌టెక్ బంగారు పతకం సాధించామని, ఇది అందరి కృషి ఫలితమేనని చీఫ్ ఇంజనీర్ (శిక్షణ, 5వ దశ) ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం పరిపాలన భవనం సమావేశ మందిరంలో థర్మల్ కేంద్రానికి మూడోసారి బంగారు పతకం సాధించిన సందర్భంగా మంగళవారం చీఫ్ ఇంజనీర్ కే సత్యసుబ్రహ్మణ్యం రాజుని అభినందించారు. కర్మాగారాల మేనేజర్ రవిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రమాదాలకు తావులేకుండా పనిచేస్తూ ‘జీరో ఆక్సిడెంట్ రేట్’ సాధించటం వల్ల మరోమారు బంగారు పతకం సాధించామన్నారు. 2017-18 గౌహతి నుంచి గ్రీన్‌టెక్ పతకం పొందామన్నారు. క్లోరిన్, అమోనియా, హైడ్రోజన్ వాయువులు లీక్ కాకుండా ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించామన్నారు. ఆన్‌సైట్ ఎమర్జెన్సీ ప్రణాళిక, ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించటం, చైన్స్, టికెల్స్, లిఫ్ట్స్, హయిస్ట్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షించి ధృవపత్రాలు పొందటం, ప్రతినిత్యం పరీక్షలు చేయటం వల్ల ఇది సాధ్యమైందన్నారు. కార్మికుల విశేష కృషి మూడోసారీ బంగారు పతకం రావటానికి దోహదపడిందన్నారు. థర్మల్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ సత్యసుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ థర్మల్ కేంద్రంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకొని నిత్యం విధులకు హాజరైన ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు అప్రమత్తంగా పని చేసినందువల్ల ఈ అవార్డు సాధించగలిగామన్నారు. కార్మికులు, ఒప్పంద కార్మికులు, ఇంజనీర్ల కృషికే ఈ అవార్డును అంకితం చేస్తున్నామన్నారు. ఎన్నో పరిశ్రమలను వెనక్కి నెట్టి ఈ అవార్డు థర్మల్ కేంద్రాన్ని వరించటం ముదావహమన్నారు. కార్యక్రమంలో భద్రతా అధికారి నాగబాబు, నవీన్ గౌతం, పుష్పలత, డీ

25న బ్రాహ్మణ ఐక్యవేదిక వన సమారాధన
విజయవాడ, నవంబర్ 20: బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25న కనకదుర్గ వారథి సమీపంలోని కరివెనవారి వృద్ధాశ్రమంలో కార్తీక వన సమారాధన జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాహ్మణ ఐక్యవేదిక సామాజిక వర్గం అభ్యున్నతి, ఐక్యతా సాధనకు ఏర్పాటు చేసుకున్న వేదికన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, గన్నవరం శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతీస్వామి హాజరుకానున్నారు. ఈసందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వివిధ రంగాల్లోని లబ్దప్రతిష్టులను సత్కరించనున్నారు. ఉదయం 3.30కి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, 10 గంటలకు మందలపర్తి సత్యశ్రీహరి బృందం సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం జరుగుతాయి. శాసనసభ్యుడు కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈసందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతాయి. ఉదయం 7గంటలకు సీతన్నపేట గాయత్రీ సొసైటీ భవనం నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు.