విజయవాడ

గ్రంథాలయ వ్యవస్థ బలోపేతానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 20: పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రంథాలయ వ్యవస్థను మరింత పటిష్ట పరచి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర న్యాయ, క్రీడ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఠాగూర్ గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గ్రంథాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మనదేశంలో అనాదిగా గ్రంథాలయ వ్యవస్థకు ప్రాముఖ్యత ఉందని దానిని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలను భాగస్వాములను చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రూప్స్‌కు, సివిల్స్ పరీక్షలకు ఎంతోమంది గ్రంథాలయాల్లో చదువుకుని ఉన్నత పదవులను చేరుకున్నారన్నారు. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రాచీన గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు అందించగలుగుతామని పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు బిజీబిజీగా ఉన్నారన్నారు. ఎందరో కవులను, రచయితలను, శాస్తవ్రేత్తలను గ్రంథాలయాలు రూపుదిద్దాయన్నారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా విషయ సేకరణ పట్ల యువత దృష్టిసారిస్తున్నారని, అయితే పుస్తక పఠనం ద్వారా మరింతగా విజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతామని న్నారు. సెస్ ద్వారా గ్రంథాలయాల పటిష్టతకు నిధులను సమీకరిస్తున్నామన్నారు. ఠాగూర్ గ్రంధాలయంలో 70వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వీటిలో 20వేలకు పైగా పుస్తకాలు సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బండారు హనుమంతరావు మాట్లాడుతూ ప్రజలకు గ్రంథాలయాలను చేరువచేయడమే ధ్యేయంగా వారోత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు. ఠాగూర్ గ్రంథాలయం రీసెర్చ్ సెంటర్‌లో పుస్తకాలను చదవడం ద్వారా ఇటీవలకాలంలో ఎందరో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ విద్యార్థులు, జర్నలిస్టులు గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలను చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్‌లోని లైబ్రరీలో వివిధ దేశాల రాజ్యాంగాలను, న్యాయశాస్త్ర గ్రంథాలను చదవడం ద్వారా భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారన్నారు. ఈనెల 14నుండి 20వతేదీ వరకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, డ్యాన్స్, చిత్రలేఖనం, పాటలు, క్విజ్, తదితర అంశాల్లో పోటీల్లో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విభిన్నప్రతిభావంతులైన చేయూత స్కూల్ విద్యార్థులచే రూపొందించిన నృత్య ప్రదర్శనకు ప్రత్యేక ప్రశంసా పత్రంతో పాటు బహుమతిని మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో సాత్వికశ్రీకి బహుమతి
కంకిపాడు, నవంబర్ 20: విద్యార్థులు విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలని నలంద విద్యాలయం ప్రిన్సిపాల్ పద్మలత అన్నారు. మండలంలోని ఈడ్పుగల్లు గ్రామంలో నలంద వసంత క్యాంపస్‌లో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 18న భవానీపురంలో 5వ ఇన్విటేషనల్ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్ వారు ఒకనోవా కోఘకి గోజురై కరాటే దోషిరేఖాన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారని తెలిపారు. నలంద నుంచి పోటీలో పాల్గొన్న సాత్వికశ్రీ ద్వితీయ బహుమతి సాధించిందన్నారు. సాత్వికశ్రీని నలంద విద్యా సంస్థల అధినేత విజయబాబు, ఉపాధ్యాయులు అభినంధించారు.

పెదపులిపాకలో ఆకతాయిల బెడద
పెనమలూరు, నవంబర్ 20: మండలంలోని పెదపులిపాక గ్రామ పరిధిలో కృష్ణా కరకట్ట దిగువన నివసిస్తున్న ప్రజలు స్థానికంగా తామెదుర్కొంటున్న పలు సమస్యలపై టీడీపీ నేత ముసునూరి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రాత్రి సమయాల్లో వీధిదీపాలు వెలగక రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. పోకిరీలు చీకటిలో కూర్చుని ఆ దారిలో తిరిగే మహిళలను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని తెలిపారు. ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయిని ఎమ్మెల్యే దృష్టకి తెచ్చారు. దీనిపై బోడే ప్రసాద్ స్పందిస్తూ వెంటనే పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు రాత్రిపూట గస్తీ తిరిగే ఏర్పాట్లు చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.