విజయవాడ

‘మీకోసం’ అర్జీలకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: మీకోసం అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల సంతృప్త స్థాయిని ం నమోదు చేయాలని జేసీ-2 పి బాబూరావు సిబ్బందిని ఆదేశించారు. సబ్ క లెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవా రం నిర్వహించే మీకోసం కార్యక్రమం లో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ మీకోసం అర్జీలను సంబంధిత అ ధికారులు సకాలంలో పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, గృ హాల మంజూరు, పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలిం చి అర్హత మేరకు మంజూరు చేయాలన్నారు. 1100 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా ప్రజాసాధికార సర్వేలో పేరు నమోదై ఉంటే రేషన్ కార్డు ఆన్‌లైన్‌లో తక్షణం మంజూరు అవుతుందని, అర్హులైన వా రు రేషన్ కార్డును 1100 టోల్‌ఫ్రీ నెం బర్ ద్వారా పొందవచ్చన్నారు. మీకోసంలో జిల్లా పొందర కుల సంక్షేమ సే వా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అర్జీ అందజేస్తూ తమకు కులధృవీకరణ ప త్రాల మంజూరులో ఎదురవుతున్న ఇ బ్బందులను పరిష్కరించాలని కోరా రు. కార్యక్రమంలో వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

జగన్‌కు ఊడిగం మానండి
విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: జగన్‌కు ఊడిగం చేయడం మానుకోవాలని వైసీపీ బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హితవు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాలని వైసీపీ అధినేతను అడిగే ధైర్యం ఆ పార్టీలోని బీసీ నేతలకుందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పాలనలోనే బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం వేశారన్నారు. అవినీతిపరుడి పంచలో బతుకుతూ కనీస మర్యాద కూడా పొందలేకుండా జగన్‌కు ఊడిగం చేస్తున్న వైసీపీలోని బిసీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కాలని చూశారని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాల కోసం 31 కులాలను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లకు కోత పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బీసీలను అణచివేస్తోందని చేస్తున్న దుష్ప్రచారం మానుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలు వైసీపీ నేతలకు తగినవిధంగా బుద్ధి చెబుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా నిర్ణయాలు తీసుకునేముందు తప్పనిసరిగా ఎదుటివారితో సంప్రదిస్తారన్నారు. కేబినెట్‌లో 8 మంది బీసీ మంత్రులు ఉన్నారన్న విషయం గుర్తించాలన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని బచ్చుల మండిపడ్డారు.