విజయవాడ

అమ్ముల పొదిలో అత్యాధునిక పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 11: బోరుబావి ప్రమాదాల నుంచి బాధితులను రక్షించేందుకు అత్యాధునిక ప్రత్యేక పరికరాన్ని సమకూర్చుకుంటున్నట్లు అగ్నిమాపకశాఖ డీజీ సత్యనారాయణ తెలిపారు. తిత్లీ తుఫాను తర్వాత 1100 ఉపకరణాలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖకు చెందిన డిప్లమో మెకానిక్ హేమంత్‌రాజు అనే వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన ‘బోర్‌వెల్ రెస్క్యూ సేవింగ్ మెకానికల్ ఎక్విప్‌మెంట్’ పరికరాన్ని డీజీ పరిశీలించారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన డెమో కార్యక్రమంలో భాగంగా పరికరానికి సంబంధించి ప్రత్యేకతలను వివరించారు. బోరుబావిలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న పిల్లలను రక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలతో ఈ పరికరం తయారు చేశారు. 150 అడుగుల లోతులో పడిపోయిన బాధితులను రక్షించే అవకాశంతోపాటు, ఈ పరికరానికి కెమేరా, ఎల్‌ఇడి లైట్, వాయిస్ సదుపాయంతోపాటు అత్యాధునిక పరిజ్ఞానం కలిగి ఉంటుందన్నారు. దీన్ని బోరు బావిలోకి పంపడం ద్వారా చిక్కుకున్న బాధితులను వెలుపల స్క్రీన్‌పై చూస్తూ జాగ్రత్తగా పైకి లాగేందుకు పరికరం దోహదపడుతుంది. డెమో నిర్వహించిన అనంతరం డీజీ సత్యనారాయణ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రత్యేక పరికరం పనివిధానాన్ని వివరించారు. బోరుబావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే ఎన్‌డిఆర్‌ఎఫ్ వద్ద ప్రత్యేక పరికరం ఉందని, అయితే ఈ ఆధునిక బోర్‌వెల్ రెస్క్యూ సేవింగ్ మెకానికల్ ఎక్యూప్‌మెంట్ అదనంగా మరింత ఉపయోగపడుతుందన్నారు. ఈ పరికరాన్ని మరింత ఆధునికీకరించి వినియోగంలోకి తీసుకువస్తామని, మరిన్ని పరికరాలు సమకూర్చుకునేందుకు ఆర్డర్ ఇస్తామన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ బోరుబావి ప్రమాదాలు జరుగుతున్నందున బాధితులను ప్రాణాలతో అతి తక్కుల సమయంలో రక్షించేందుకు దోహదపడతాయని చెప్పారు. అదేవిధంగా తిత్లీ తుఫాను సందర్భంగా జరిగిన విధ్వంసం నుంచి సహాయ చర్యలు చేపట్టేందుకు 1100 రకాల పరికరాలు సమకూర్చుకున్నామని, పొలాల్లో నేరకొరిగిన చెట్లను తొలిగించేందుకు వినియోగించామన్నారు. అదేవిధంగా సకల సౌకర్యాలతో అగ్నిమాపకశాఖకు ఓ ప్రత్యేక వాహనాన్ని సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా కొత్తగా 28 అగ్నిమాపకశాఖ శకటాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పొల్చితే మన రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ ప్రస్తుతం అత్యాధునిక పరిఙ్ఞనంతో కూడిన వాహనాలు, పరికరాలు కలిగి ఉందని, ఎలాంటి విపత్తులోనైనా సహాయక చర్యలు చేపట్టేందుకు కావాల్సిన సమర్ధత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఫ్‌ఓ శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.