విజయవాడ

బీజేపీ పతనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 11: దేశంలో బీజేపీ పాలనకు పతనం ప్రారంభమైందన్న విషయం మంగళవారం వెలువడిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ఒక విడుదల చేశారు. ఈ ఫలితాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను చాటగా, రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మ్రోగించడం శుభ పరిణామమన్నారు. రాహుల్ నాయకత్వాన్ని పదే పదే ఎగతాళి చేసిన బీజేపీ నాయకులకు ఈ ఫలితాలు చెంప పెట్టులాంటివన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న ప్రజాకాంక్షకు అద్దం పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ప్రజలు తమ ఓటుతోజవాబు చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి ఎదురుదెబ్మ తగిలినప్పటికీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఖాయమని, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు టీఆర్‌ఎస్ పాల్పడకపోతే అసెంబ్లీలో గట్టి ప్రతిపక్షంగా ఏర్పడి ఉండేదన్నారు.

కాంగ్రెస్ విజయంతో నగరంలో సంబరాలు
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 11: బీజేపీ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేపట్టారు. ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో విజయం సాధించిన సందర్భంగా మంగళవారం సాయంత్రం నగరంలోని ఏపీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ నేతలు విజయోత్సాహంతో బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటుచేయనున్న తరుణంలో ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కి ప్రజాదరణ లభించడం అభినందనీయమని పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీ గురునాధం తదితరులు పాల్గొన్నారు.