విజయవాడ

బాలికల రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 11: రొయ్యల చెరువుల కంపెనీల్లో ఉపాధి కల్పిస్తామంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా నెల్లూరుకు తరలిస్తున్న 8 మంది గిరిజన బాలికలను తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లా అరకు, పాడేరు ప్రాంతాలకు చెందిన 8 మంది బాలికలను ఒక వ్యక్తి నెల్లూరుకు తలిస్తున్న విషయాన్ని గుర్తించిన నెల్లూరు రైల్వే పోలీసులు ఆ బాలికలను చైల్డ్‌లైన్‌కు అప్పగించగా, చైల్డ్‌లైన్ వారు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. తదుపరి విచారణ చేపట్టిన చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ బీవీఎస్ కుమార్ బాలికలకు ఆశ్రయం ఇచ్చి వారి తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో తల్లిదండ్రులు కానీ, బాలికలు కానీ తమను ఉపాధి నిమిత్తం ఎక్కడికి, ఏ కంపెనీకి తీసుకెళ్తున్నారన్న విషయంపై స్పష్టమైన సమాచారం తెలుపకపోవడంతో పోలీసుల అనుమానం మరింత ఎక్కువయింది. బాలికలను తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏసు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతను తెలిపిన సమాచారం మేరకు అక్కడ ఉపాధి నిమిత్తం పనివారలు అవసరం ఉందా లేదాన్న అంశంతోపాటు కంపెనీ వివరాలపై విచారణ చేయాలని నెల్లూరు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారికి సమాచార అందజేశారు. డీసీఎల్ నివేదిక రాగానే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని, ఒకవేళ నిజంగా ఉపాధి నిమిత్తమే అయితే అక్కడ కార్మికులకు కల్పిస్తున్న వసతులు, వేతనాల వివరాలపై కూడా తగు సమాచారం సేకరించనున్నారు. ఈ నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకూ బాలికలు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉండేందుకు గాను వారిని తిరిగి వారి స్వస్థలాలకు పంపించినట్టు చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ బీవీఎస్ కుమార్ పేర్కొన్నారు. డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి నివేదిక రాగానే ఈ ఘటనలో బాలికల రవాణా విషయం రుజవైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.