విజయవాడ

రోగి వద్దకే డాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 12: సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా అందరికీ ఆరోగ్య కల్పనలో వైద్యాధికారులు భాగస్వాములవ్వాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ అధికార, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలనలో భాగంగానే రోగి వద్దకే డాక్టర్ అనే భావనతో గ్రామాలలోని ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలన్నారు. రోజుకు కనీసం ఇద్దరు వ్యక్తులను ఆరోగ్యవంతులుగా మార్చాలని అంటూ వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు ముఖ్యంగా వయోవృద్ధులు ఆనందం వ్యక్తచేస్తారన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం, రాష్ట్రంలో డయాబిటీస్ వ్యాధి ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్ ఆయా వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం తోపాటు చైతన్యం చేయాలన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలని, చెక్కర శాతం తక్కువగా ఉండే రాగులు, జొన్నలు, సజ్జల వాడకాన్ని పెంచాలన్నారు. యోగాసనాలు, నడక పట్ల అవగాహన కల్పించాలని, మాస్టర్ హెల్త్ చెకప్‌లో ప్రతి ఒక్కరినీ పరీక్షించి వారి ఆరోగ్య వివరాలను వివరిస్తే ముందస్తు జాగ్రత్తలు పెరుగుతాయన్నారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులను గణనీయంగా తగ్గించి నిరోధించగలిగామని, ఇదే స్ఫూర్తితో డయాబటీస్, బీపీ, ఒబేసిటీ తగ్గించే విధంగా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని, కిడ్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు మూలం డయాబటీస్ అన్న విషయాన్ని ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. మద్యం వినియోగంతో కలిగే దుష్ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించి మద్య సేవనాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టీవీఎల్‌ఎన్ శాస్ర్తి, ఐసీడీఎస్‌పీడీ కే కృష్ణకుమారి, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజావలి, లతోపాటు పలువురు వైద్య అధికారులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం మెరుగుకు స్వచ్ఛ సంక్రాంతి
విజయవాడ (సిటీ), డిసెంబర్ 12: గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వచ్ఛ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. ఈనెల 13నుండి 22వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో రోడ్ల పక్కన పోగు చేసిన చెత్తకుప్పలు, పశువుల పేడ కుప్పలను తొలగించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విస్తరణ అధికారులు స్వచ్ఛ సంక్రాంతిలో చురుగ్గా పాల్గొనాలన్నారు. ఈనెల 22వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శులకు జడ్పీ ముఖ్యకార్యనిర్వసణ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో ప్రయోగాత్మక శిక్షణ నిర్వహించాలన్నారు. ఈ శిక్షణలో గ్రామంలోని చెత్త, పశువుల పేడ కుప్పలను గుర్తించి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రిస్ యాప్‌లో నమోదు చేయించి అదే రోజు తొలగించే కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామాలలో గుర్తించిన చెత్తా, పేడ కుప్పలను తొలగించేందుకు ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు పంచాయతీ కార్యదర్శులకు టెలికాన్ఫరెన్స్, వీడీయోకాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, ఆదేశాలు ఇవ్వాలన్నారు. స్వచ్చ సంక్రాంతిలో పంచాయతీలలో నియమించబడిన గ్రీన్ అంబాసిడర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. అవసరమైతే ఉపాధి హామీ కార్మికుల సేవలను వినియోగించుకోవచ్చున్న ఆయన దీనికయ్యే ఖర్చును గ్రామపంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులు నుండి వినియోగించుకోవచ్చని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు.