విజయవాడ

సీఎం చంద్రబాబును కలిసిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబుని పలువు రు విద్యార్థులు కలిశారు. చిత్తూరు గుడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం సీ ఎంను కలిసారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబును 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు కలిశారు. అమరావతి, పట్టిసీమ, పోలవ రం ప్రాజెక్టులపై ఎడ్యుకేషన్ టూర్‌లో భాగంగా సీఎం చంద్రబాబును కలిసి, ఆయన ఆశీస్సులను తీసుకున్నారు.

బీసీసీఐ సీనియర్ మహిళల ఎలైట్ టోర్నీలో
ఆంధ్ర, హర్యానా, గోవా విజయం
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 12: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీసీఐ సీనియర్ మహిళల ఎలైట్ గ్రూప్-ఏ పోటీల్లో బుధవారం ఆంధ్ర, హర్యానా, గోవా జట్లు విజయం సాధించాయి. పంజాబ్ జట్టు సభ్యురాలు తానియాభాటియా 60 పరుగులు, గోవా జట్టు సభ్యురాలు వినవి గౌరవ్ 73 పరుగు లు నాటౌట్, షీకాపాండే 71 పరుగులు నాటౌట్, విదర్భ జట్టు సభ్యురాలు భా రతీ 76 పరుగులు నాటౌట్, హర్యానా షఫలీవర్మ 53 పరుగులు, ఆంధ్ర జట్టు సభ్యురాలు జీ చంద్రలేఖ 71 పరుగులు చేశారు. మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో గోవా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో గోవా జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 49.1 ఓవర్లలో 187 పరుగులకు అలౌటైంది. జట్టులో తాని యా భాటియా 60 పరుగులు చేయ గా, జాసియా అక్తర్ 25 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బ్యా టింగ్‌కు దిగిన గోవా 42.4 ఓవర్లలో 2 వికెట్ల తేడాతో 190 పరుగులు చేసింది. జట్టులో వినవి గౌరవ్ 73 పరుగులతో నాటౌట్‌గా నిలువగా పూర్వజ 33 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో విద ర్భ, హర్యానా జట్లు తలపడగా 5వికెట్ల తేడాతో హర్యానా విజయాన్ని నమో దు చేసింది. టాస్ గెలిచిన విదర్భ బ్యా టింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల న ష్టానికి 142 పరుగులు చేసింది. జ ట్టులో భారతీ 67 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 33.4 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. షఫలీవర్మ 53, మాన్షీజోషి 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. గుంటూరులో జరిగిన మరో మ్యాచ్ లో ఆంధ్ర, సౌరాష్ట్ర జట్లు తలపడగా 62 పరుగుల తేడాతో ఆంధ్ర విజయా న్ని సాధించింది. టాస్ గెలిచిన సౌరాష్ట్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆం ధ్ర జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసిం ది. జట్టులో జీ చంద్రలేఖ 71 పరుగు లు, ఎస్ హిమబిందు 41 పరుగులు చే శారు. 207 పరుగుల లక్ష్యంతో బ్యా టింగ్ దిగిన సౌ రాష్ట్ర జట్టు 50ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిం ది. జట్టులో పీఎస్ నిమవత్ 30 పరుగులు, జడేజా 32 పరుగులు చేశారు.