విజయవాడ

దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని అన్ని వైష్ణవ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో పలు ఆలయాలు కిటకిట లాడాయి. పాతబస్తీ శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలోతరలి వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఒక ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తిని ఉంచి ముందు భాగంలో ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మంగళవారం వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకొని వారి వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. వేకువ జామున ఆలయ అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్ర శర్మ దేవస్థానం ఈవో కెవియన్‌డికె ప్రసాద్ దంపతుల చేత తొలి పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగింది. వైకుంఠ ఏకాదశి కావటంతో అధిక సంఖ్యలోశివదీక్ష పరులు స్వామివారి సన్నిధిలో ఇరుముడులు కట్టించుకొని శ్రీ శైలం బయలు దేరారు. ఆలయ సీనియర్ గుమస్తా అప్పారావు, సోము, శ్రీను, శివ తదితరులు భక్తులకు రెండు రకాలైన ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12గంటలకు అయ్యప్ప దీక్షాపరులకు ఉచితంగా సద్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ధర్మకర్తలు పొట్నూరి దుర్గా ప్రసాద్, అడ్డూరి లక్ష్మణరావు తదితరులు స్వామివార్లను దర్శనం చేసుకున్నారు. పాతబస్తీ శ్రీ బ్రాహ్మణ వీధి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోకొలువై ఉన్న స్వామివార్లను దర్శనం చేసుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలోతరలి వచ్చారు. తుఫాన్ కారణంగా వేకువ జామున భక్తుల రద్దీ స్వల్పంగా ఉన్నప్పటికీ ఉదయం 7గంటల నుండి క్రమంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ భక్తుల రద్దీ మధ్యాహ్నం 3గంటల వరకు ఆలయంలో కొనసాగింది. ఇక్కడ కొలువై ఉన్న స్వామివార్లను ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవటానికి భక్తులకు సుమారు రెండుగంటల సమయం పట్టింది. భక్తుల కోసం దేవస్థానం ఈవో హేమలతాదేవి మూడు ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేశారు. ఉదయం సుమారు 7గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ క్రమంగా మధ్యాహ్నం 4గంటల వరకు కొనసాగింది. ఇవో ఆదేశాల మేరకు దేవదాయ ధర్మాదాయశాఖకు చెందిన సిబ్బంది భక్తులను ఒక వరుస క్రమంలో నియంత్రిస్తూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకోనేందుకు అనుమతించారు. ఈసందర్భంగా ఆలయ ప్రాంగణంలో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు మూడు రకాలైన ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉదయం వేరు వేరు సమయాల్లో ఎమ్యెల్సీ చీఫ్ విప్ బుద్దా వెంకన్న, మాజీ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బారాయుడు, మాజీ చైర్మన్ కొనుగళ్ళ విద్యాధరరావు, బీజేపీ సీనియర్ నేత సూరే సుబ్బారావు, దుర్గగుడి రినోవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పోతిన పైడారావు తదితరులు స్వామివార్లను దర్శనం చేసుకున్నవారిలో ఉన్నారు. ప్రోట్‌కాల్ ఉన్న వారికి ఆలయ ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోనికి తీసుకువెళ్ళారు. స్వామివారి దర్శనం అనంతరం వీరికి స్వామివారి ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. నెహ్రూ బొమ్మ సెంటర్‌లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధికి భక్తులు వేకువ జామునుండే భక్తులు అధిక సంఖ్యలోతరలి వచ్చారు. ఈవో వి కోటేశ్వరమ్మ ఆదేశాల మేరకు దత్తత ఆలయాల సీనియర్ గుమస్తా రమేష్ వేకువ జామునే ఉత్తర ద్వార దర్శనానికి సకల ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివార్లను దర్శనం చేసుకొని వారి వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు భక్తులు అధిక సంఖ్యలోతరలి వచ్చారు. ఉదయం వైకాపా రాష్ట్ర నేత పైడిపాటి రమేష్, బిసి నేత సారేపల్లి రాధాకృష్ణ యాదవ్, స్ధానిక నేతలు పైడిపాటి మురళీ, గర్రే చినబాబు తదితరులు స్వామివార్లను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ సిబ్బంది భక్తులకు రెండు రకాలైన ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. భావన్నారాయణ వీధి శ్రీ కోదండ రామాలయంలో కొలువై ఉన్న స్వామివార్లను దర్శనం చేసుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కాజాలక్ష్మీమోహనరావు ఆధ్వర్యంలో విస్తుృత స్ధాయిలో ఏర్పాట్లు చేశారు. శ్రీ నగరేశ్వర శ్రీ కోదండ రామాలయానికి భక్తులు వేకువ జామునుండే అధిక సంఖ్యలోతరలి వచ్చారు. ఉదయం 6గంటలనుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయంలో భక్తుల రద్ధీ కనబడింది. నగరంలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో ఈసందర్భంగా స్వామివార్ల అత్యంత వైభవోపేతంగా ఉత్సవ మూర్తి పల్లకిలో ఉంచి అత్యంత వైభవోపేతంగా నగరోత్సవాన్ని నిర్వహించారు.