విజయవాడ

హర్యానా, విదర్భ, పంజాబ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 18: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీసీఐ సీనియర్ మహిళల ఎలైట్ గ్రూప్-ఏ పోటీల్లో మంగళవారం హర్యానా, విదర్భ, పంజాబ్ జట్లు విజయం సాధించాయి. హర్యానా జట్టు సభ్యురాలు షీతల్ రాణా 51 పరుగులతో నాటౌట్‌గా నిలువగా మహారాష్ట్ర జట్టు సభ్యురాలు టీఎస్ హాసబ్నిస్ 50 పరుగులు, విదర్భ జట్టు సభ్యురాలు లాటికా ఇనందర్ 50 పరుగులు చేశారు. మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో మహారాష్ట్ర, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 24 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేశారు. జట్టులో టిఎస్ హాసబ్నిస్ 50 పరుగులు, దేవికా వైద్య 29 పరుగులు చేశారు. 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 23.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జట్టులో రధిమా అగర్వాల్ 29 పరుగులు, తానియాభాటియా 20 పరుగులు చేశారు. మరో మ్యాచ్‌లో విదర్భ, సౌరాష్ట్ర జట్లు తలపడగా 8 వికెట్ల తేడాతో విదర్భ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన విదర్భ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర జట్టు 30 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేశారు. జట్టులో మృధుల జాడేజా 22 పరుగులు, జాయు జడేజా 21 పరుగులు, రిధి 21 పరుగులు చేశారు. 106 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. జట్టులో లాటికా ఇనందర్ 50 పరుగులు చేయగా దీషా 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. గుంటూరులో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా, హార్యానా జట్లు తలపడగా 51 పరుగుల తేడాతో హార్యానా విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన గోవా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన హార్యానా జట్టు 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. జట్టులో వర్మ 40 పరుగులు చేయగా షీతల్ రాణా 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన గోవా జట్టు 23 ఓవర్లలో 96 పరుగులకు అలౌటయింది. జట్టులో సుధాకర్‌నాయక్ 30 పరుగులు, షీకాపాండే 20 పరుగులు చేశారు.

కృష్ణా వర్సిటీ కబడ్డీ పురుషుల జట్టు ఎంపిక
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 18: కృష్ణా విశ్వవిద్యాలయం కబడ్డీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావుతెలిపారు. ఎంపికైన ఈ జట్టు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఈనెల 19నుండి 23వరకు జరగనున్న దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయాల కబడ్డీ పురుషుల టోర్నమెంట్‌లో పాల్గొంటుందన్నారు. ఎంపికైన జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ వంశీ, పి ఉపేంద్ర, ఎస్ దుర్గాప్రసాద్, ఎల్ రవితేజ, ఎ లచ్చిరామ్ నాయక్ (ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), జె అంకలు (ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ కళాశాల), ఆర్ నాగరాజు (కెవిఆర్ కళాశాల), వి పూర్ణచంద్రరావు (పిబి సిద్ధార్థ కళాశాల), బి యశ్వంత్ (ది హిందూ కళాశాల), జి రఘురామ్, వై సైధులు (ఎస్‌జిఎస్ కళాశాల), ఇ రామకృష్ణ (ఆంధ్రా లాయోల కళాశాల)లు ఎంపికయ్యారు. ఈజట్టుకు కోచ్‌గా ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ విద్యా సంచాలకులు ఎం కోటేశ్వరరావు, మేనేజర్‌గా ఎస్‌జిఎస్ కళాశాల వ్యాయామవిద్యా సంచాలకులు ఎం స్వామి వ్యవహరిస్తారు.