విజయవాడ

విద్యుత్ పొదుపు అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), డిసెంబర్ 18: విద్యుత్ పొదుపు విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వీ వెంకటరమణ అన్నారు. దేశమంతటా ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు చేపట్టిన విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా మోటారుకు వినియోగించే విద్యుత్ విషయంలో పరిమితికి మించి ఉపయోగించడం, కార్యాలయాల్లో కార్యక్రమాల అనంతరం వదిలి వెళ్లే సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్ వంటి విద్యుత్ పరికరాలను వినియోగంలో వదిలి వెళ్లపోవడం, పగటి సమయంలో బయట నుంచి వెలుతురు వస్తున్నప్పటికీ లోపలి వైపు యథావిథిగా విద్యుత్ దీపాలు వినియోగించడం, శక్తి సామర్థ్యం లేనటువంటి విద్యుత్ ఉపకరణాలను వినియోగించడం వల్ల విద్యుత్ ఆదా చాలా వరకు తగ్గుతుందని అన్నారు.

తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను కారణంగా రెండు రోజులు కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు పొలాల్లో ధాన్యం తడిసిపోగా, చేలలో గూళ్లచుట్టూ నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బొర్రా కిరణ్ డిమాండ్ చేశారు. మండలంలోని కొండపల్లి, ఈలప్రోలు, ఇబ్రహీంపట్నం, మూలపాడు గ్రామాల్లో తుపానుకు నష్టపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో చేతికి అందివచ్చే పంట నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దాములూరు, చిలుకూరు, కాచవరం, కొటికలపూడి, కేతనకొండలో శనగపైరు నీట మునగటంతో కుళ్లిపోయిందన్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రకొండ అప్పారావు, కొప్పుల చిన్నప్ప, స్వర్గం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.