విజయవాడ

మరింత అభివృద్ధికి జన్మభూమి సభలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 11: ప్రజల సమక్షంలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వల్ల మరింత అభివృద్ధి సాధ్యపడుతుందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు స్థానికంగా అవసరమైన అభివృద్ధి పనులపై చర్చించి తగు నిర్ణయం తీసుకునే విధంగా జన్మభూమి గ్రామ సభలు దోహదపడుతున్నాయన్నారు. గత 4 ఏళ్ల 9 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చ జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో ప్రజలు విశేషంగా పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకున్నారన్నారు. సామాజిక, కుటుంబ వికాసం, స్టార్ రేటింగ్ ఆధారంగా జిల్లాలో అభివృద్ధిని లెక్కించడం జరుగుతుందన్నారు. 2022 నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలు, నగర పాలక సంస్థ స్కూల్స్ పరిధిలో డిజిటల్ క్లాస్ రూమ్‌లుగా రూపొందించడం జరుగుతుందన్నారు. 21వ డివిజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధిని చర్చించిన నేపథ్యంలో మొత్తం 1224 మందికి పెన్షన్లు అందిస్తుండగా మరో 39 పెన్షన్లను నూతంగా అందించాల్సి ఉందన్నారు. గృహాల సమస్యను పరిష్కరించేందుకు జక్కంపూడిలో టౌన్‌షిప్ నిర్మిస్తున్నట్టు తెలిపిన కలెక్టర్ లక్ష్మీకాంతం ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి రక్షణ గోడ నిర్మించి గృహాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సదా మీ సేవలో రెవెన్యూ శాఖ ద్వారా కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలను విద్యా సంవత్సరం ముందుగానే అందిస్తున్నామన్నారు. వీఎంసీ పరిధిలో 450 మందికి 388 ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా క్రమబద్ధీకరణ నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందాలని కోరారు. 21వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే మెరుగైన పథకాలను అమలు చేస్తున్న కారణంగా స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా 5లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని అందించడమే కాకుండా డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేశామన్నారు. పుట్టిన నాటి నుంచి మరణించే వరకూ అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.