విజయవాడ

31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31న భూకర్షణం, బీజావాసం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో భూకర్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం జేఈవో పోలా భాస్కర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 9.15 గంటల నుంచి 9.40 గంటల మధ్య భూకర్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఆగమ శాస్త్ర ప్రకారం భూకర్షణ చేయడం ఆనవాయితీ అని, ఆగమ సలహాదారుల సూచన మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. రాజధానిలో టీటీడీకి సీఆర్‌డీఏ 25 ఎకరాలు కేటాయించిందని, ఇందులో 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. ఆడిటోరియంలు, కల్యాణమండపాలు చేపట్టేందుకు ప్రతిపాదించామన్నారు. దాదాపు 140 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు ఖరారు చేశామన్నారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు గత ఏడాది జూలైలో కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏజన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. విశాఖ, భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలను, చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ధర్మ ప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి, తిరుమల తరహాలో సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. భూకర్షణం కోసం హోమగుండాలు, వేదిక, ఆలయ నమూనా, ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని తెలిపారు. భూకర్షణంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామన్నారు. భూకర్షణం తరువాత 10 రోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఆ తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు శ్రీవారి సేవకులను, భజన బృందాలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ సముదాయాలు
పరిశుభ్రంగా ఉండాలి
కమిషనర్ నివాస్
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ నగరంలో మొదటి ర్యాంకు సాధనలో అందరూ భాగస్వాములవ్వాలన్న వీఎంసీ కమిషనర్ జె. నివాస్ నగరంలోని అన్ని మార్కెట్ సముదాయాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రతి షాపు నిర్వాహుకుడు తమ దుకాణ చెత్తను విధిగా బీన్స్‌లో వేసుకుని పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం బీసెంట్ రోడ్డులోని మహంతి మార్కెట్, కేదరేశ్వరపేట పండ్ల మార్కెట్, రైతు బజార్లలో పారిశుద్ధ్య నిర్వహణ విధానాన్ని పరిశీలించిన ఆయన మార్కెట్ సముదాయాలలో మెరుగైన నిర్వహణ విధానాలను అమలు చేయాలని ఆదేశించారు. గవర్నర్‌పేట మహంతి ఫిష్ మార్కెట్‌లో వ్యాపారులతో మాట్లాడిన ఆయన పలు సూచనలు చేశారు.