విజయవాడ

ఓకే సారి 8వేల ఇళ్ల కేటాయింపు చారిత్రక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: రాజధాని అమరావతి నగరానికి ముఖ ద్వారంగా ఉన్న విజయవాడ నగరంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు పక్కాగృహం మంజూరు చేయాలన్న లక్ష్యంతో పీఎంఏవై పథకం కింద ఎన్‌టిఆర్ నగర్‌లో నిర్మితమైన పక్కాగృహాల కేటాయింపు ఒక చారిత్రాక ఘట్టమని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఒక్క ఇటుకైనా కట్టలేదంటూ విపక్షాలు తమ రాజకీయ ప్రచారానికి వినియోగించుకున్న పక్కాగృహాల అంశానికి జక్కంపూడి ఎన్‌టీఆర్ నగర్ గృహాలే సమాధానం చెబుతాయన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈప్రక్రియతో విపక్షాలు నోళ్లు మూసుకున్నాయని మేయర్ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఎన్‌టీఆర్ నగర్ గృహాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన లాటరీ విధానంలో మొత్తం 8, 285 మంది లబ్ధిదారులకు తమ గృహాలను కేటాయించారు. తొలుత మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఆధునిక వసతులతో కూడిన పక్కాగృహాలను అతి తక్కువ ధరకు అందిస్తున్నారన్నారు. నగరానికి మొత్తం 28వేల ఇళ్లు మంజూరు కాగా తొలి దశలో 8,285 ఇళ్ళను పూర్తి చేశామన్నారు. మరికొద్ది రోజుల్లో 160 ఎకరాల్లో రెండవ దశ ఇళ్ళ నిర్మాణానికి చంద్రబాబు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గొల్లపూడి, కంకిపాడు, గన్నవరం తదితర ప్రాంతాలలో ఎకరం కోటి చొప్పున వందల ఎకరాలను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఇదిలావుండగా పేదలు సైతం ఆధునిక వసతులతో కూడిన గృహంలో నివశించాలన్న ఉద్దేశ్యంతో షేర్‌వాల్ టెక్నాలజీతో ఒక్క ఇటుకనైనా వినియోగించకుండా మొత్తం సిమెంట్ కాంక్రీట్‌తో గృహాలను నిర్మించామన్నారు. గృహంలో అవసరమైన టైల్స్, బాత్‌రూమ్ ఐటమ్స్, కిచెన్ రూమ్‌లో టైల్స్, కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం లబ్ధిపొందిన వారి ఆధార్ వివరాలను ఇంటి కేటాయింపులో నమోదు చేసినందున భవిష్యత్తులో వీరికి మరెక్కడా ప్రభుత్వం తరఫున ఇళ్ల కేటాయింపు జరగదన్న విషయాన్ని గుర్తించి పక్కాగృహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీఎంసీ కమిషనర్ జే నివాస్ మాట్లాడుతూ మొత్తం 8285 గృహాలలో పశ్చిమ నియోజకవర్గానికి 2,767, సెంట్రల్ నియోజకవర్గంలో 2,749, తూర్పు నియోజకవర్గం పరిధిలో2,768 మందికి గృహాలను కేటాయించినట్టు తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, స్పోర్ట్స్ కమిటీ ప్రత్యేక కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ, విద్యా ప్రత్యేక కమిటీ చైర్మన్ నజీర్ హుస్సేన్, కార్పొరేటర్లు అల్లు జయలక్ష్మీ, వీరంకి కృష్ణకుమారి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉత్తమ్ చంద్ బండారి, అదనపు కమిషనర్ జనరల్ డి చంద్రశేఖర్, హౌసింగ్ ఈఈ మోహనరావు, డీఈఈ వేటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు వీఎంసీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకర్షించాయి.