విజయవాడ

పేదల పెన్నిధి ఎన్‌టీఆర్ * మంత్రి దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: పేద బడుగు బలహీన వర్గాల మనస్సుల్లో తరతరాలుగా చిరస్థాయిగా దేవుడుగా నిలిచిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 23వ వర్ధంతి కార్యక్రమం కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు 4000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి కుల మతాలలకు అతీతంగా ఎంతో మంది విద్యావంతులను రాజకీయంలోకి తీసుకువచ్చిన ఘనత కేవలం ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సమాజంలో జరుగుతున్న అసమానతలను గుర్తించి, పేద బడుగు బలహీన వర్గాలకు అందని ద్రాక్షలాగా ఉన్న సంక్షేమ ఫలాలను పూర్తిగా వారికి అందించాలనే లక్ష్యంతో టీడీపీ స్థాపించబట్టే ఎంతో ఉన్నత విద్యావంతులు రాజకీయాలోకి వచ్చి ప్రజా సేవ చేసే అవకాశం లభించిందన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ ఆదర్శమయ్యాయని అన్నారు. ఎన్టీఆర్ ప్రజల మనస్సులో ఎప్పటికైనా చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. 2వ డివిజన్‌కు చెందిన నిరుపేద కార్యకర్త బొడ్డు ప్రశాంతికి అర్బన్ పార్టీ అధికార ప్రతినిధి దాసరి హరికృష్ణ రూ.25వేలు విలువ చేసే టిఫిన్ బండిని ఉచితంగా అందించారు. ఈ టిఫిన్ బండిని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోనేర్ శ్రీ్ధర్, యలమంచిలి గౌరంగబాబు, ప్రేమనాథ్, చెన్నుపాటి ఉషారాణి, రహీం, అఫ్సర్, ముమ్మనేని ప్రసాద్, ఆళ్ళ చల్లారావు, అన్నాభక్తుని బాబి, చలసాని రమణ, వెంకట సత్యనారాయణ, రవి, నిర్మల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.