విజయవాడ

దేశానికే తలమానికంగా స్విమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: దేశానికే తలమానికంగా రానున్న ఐదేళ్ల కాలంలో తిరుపతిలోని స్విమ్స్‌ను తీర్చిదిద్దాలని అత్యుత్తమ వైద్యసేవలు అందించటంలో నెంబర్ వన్‌గా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతున్న తమ కృషికి సహకరించాలని ప్రజారోగ్యంలో హ్యాపీనెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) పాలకమండలి సమావేశం శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య సేవలపై ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి తేవాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఫలితాల సాధనకు దీర్ఘ, మధ్య, స్వల్ప కాలిక లక్ష్యాలతో పనిచేయాలని నిర్దేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి శాలరీ గ్రాంట్‌కు బడ్జెట్ ఇస్తామని ఇందుకు అనుగుణంగా తదుపరి ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఆదేశించారు. టీటీడీ, స్విమ్స్ సమన్వయంతో పనిచేయాలని, సేవా పథకాల అమలులో మరింత సహకారం తీసుకోవాలని పాలకమండలికి సూచించారు. స్విమ్స్ లాంటి సంస్థలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంస్థ స్వయం పోషకత్వం సాధించేందుకు కృషి జరగాలన్నారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. అన్నదానం ట్రస్ట్ తరహాలో అన్న క్యాంటీన్లకు విరాళాలిచ్చే దాతలను ప్రోత్సహించాలని, ఈ దిశగా సూచనలందించాలని టీటీడీ ఈఒ అనిల్‌సింఘాల్‌ను ముఖ్యమంత్రి కోరారు. స్విమ్స్ సేవా భావంతో చేపట్టిన పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి డైరెక్టర్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టీఎస్ రవికుమార్ నివేదిక సమర్పిస్తూ నారావారిపల్లె పీహెచ్‌సీని స్విమ్స్‌కు అనుబంధ కేంద్రంగా ప్రకటించేందుకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉందన్నారు. 2018-19లో స్విమ్స్‌కు రూ 50కోట్ల శాలరీ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పూనం మాలకొండయ్యను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్విమ్స్‌లో అమలు చేస్తున్న ఆదిత్య హృదయం, ప్రివెంటివ్ కార్డియాలజీ కార్యక్రమాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే పింక్ బస్ స్ట్రాటజీని రూపొందించి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వైస్‌ఛాన్స్‌లర్ వివరించారు. ముందుగానే వ్యాధిని కనుగొని ప్రాథమిక దశలోనే నిరోధించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ మరణాలను 63 శాతానికి తగ్గించ గలిగామన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్విమ్స్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఓటర్లలో చైతన్యం, యువతకు ఓటు హక్కు కల్పన
* కలెక్టర్ బీ లక్ష్మీకాంతం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: జిల్లాలో ఓటర్ల చైతన్య కార్యక్రమాలతోపాటు యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్టు కలెక్టర్, ఎన్నికల అధికారి బీ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కాలేజ్ విద్యార్థులు, ఎన్‌జీవో ప్రతినిధులతో ఓటరు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక వజ్రాయుధమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 46 నుంచి 47 లక్షల మంది జనభా కలిగిన జిల్లాలో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి 1000 మందికి 700 మంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 33లక్షల 3వేల మంది ఓటర్లతో 702 నిష్పత్తిలో జిల్లా ఉందని తెలిపారు. ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ కాగా ఆన్‌లైన్ విధానంతోపాటు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారి ద్వారా ఓటు హక్కును పొందవచ్చన్నారు. జనవరి 11వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేశామని, ఈ జాబితాలో తమ ఓటు ఉందా, లేదాన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. 1950 సంక్షిప్త సమాచారం ద్వారా కూడా ఓటు హక్కు తెలుసుకోవచ్చునని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, ప్రతి కేంద్రంలో మంచినీరు, మరుగుదొడ్డి, విద్యుత్, మురుగుపారుదల, వికలాంగుల కోసం ర్యాంపు,చిన్న పిల్లల కోసం క్రష్, అన్ని వౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. ఓటరు నమోదుకు బూత్ స్థాయి లెవల్ ఆఫీసర్ 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్, ఆపైన సహాయ ఎన్నికల అధికారి, ఉంటారని, ఇక ఇఆర్‌ఓ జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్ ఉంటారన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, వేరోక చోట ఉంటే తొలగిస్తామని అన్నారు. కళాశాలలో ఓటరు నమోదుకు అంబాసిడర్లను నియమించి వారి ద్వారా 18-19 వయస్సు ఉన్న వారిని గుర్తించి ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణణ్, జేసీ -2 పీ బాబూరావు, సబ్ కలెకటర్లు మీషాసింగ్, స్వప్నిల్ దినకర్, ఆర్‌డివోలు ఉదయభాస్కర్, సత్యవేణి, డీఈవో రాజ్యలక్ష్మీ, డీపీవో విక్టర్, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీ సత్యనారాయణ తదితరులతోపాటు వివిధ కళాశాలల విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.