విజయవాడ

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథిగా యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 15: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవ చేయడంలో యువతను భాగస్వాములను చేయడానికి యూత్ ఫర్ ఆంధ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర యువజన, న్యాయ, క్రీడల శాఖమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూత్ ఫర్ ఆంధ్రా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతను ప్రభుత్వ పథకాల అమలు, విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం పెంచడానికి, ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలుకు సంధానకర్తలుగా చేయడం కోసం యూత్ ఫర్ ఆంధ్రా కార్యక్రమం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న యువతీ యువకులకు సీనియర్ అధికారులు ప్రభుత్వ పథకాలు, విధానాలపై శిక్షణ ఇస్తారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను యువత ప్రజల్లోకి తీసుకువెళ్ళి అమలు జరుగుతున్న విధానాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉందన్నారు. అభివృద్ధి. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో యువత భాగస్వామ్యానికి వారికి యూత్ అంబాసిడర్స్ సర్ట్ఫికేట్స్ ఇచ్చి గౌరవించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పనితీరు అంచనాతో పాటు అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉధ్ధేశ్యమన్నారు. యూత్ ఫర్ ఆంధ్రా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రార్ అయినా వారిలో పదివేల మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పొందిన వారిలో అత్త్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మందితో సీఎం వీడియో కాన్పరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారని పేర్కొన్నారు. 4.46 లక్షలమంది నిరుద్యోగ యువతకు ఈనెలలో 1000 రూపాయల నిరుద్యోగభృతి ఇస్తున్నామన్నారు. వచ్చే నెల నుండి 2000 పెంచి ముఖ్యమంత్రి యువనేస్తం క్రింద నిరుద్యోగ యువతకు భృతి అందిస్తామన్నారు. ఇప్పటివరకు 80వేల మంది ధరఖాస్తు చేసుకోగా 40వేల మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

పథకాల అమల్లో ‘తూర్పు’దే అగ్రస్థానం
పటమట, ఫిబ్రవరి 15: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పూర్తిగా పరిష్కరించటంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముందంజలో ఉంటారని ఎంపీ కేశినేని నాని అన్నారు. 83 కోట్ల ప్రభుత్వ ప్రత్యేక నిధులతో శుక్రవారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు రెండో డివిజన్ కామినేని నగర్‌లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపనలు చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేయలేని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదల సంక్షేమ కోసం విద్య, ఆరోగ్యం తదితర వాటిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, యలమంచిలి రాజేంద్రప్రసాద్, ఈఈ ఐజాక్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి రాజధాని నగరాన్ని సందర్శించిన
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: అమరావతి నగరాన్ని ఆనంద నగరాల సదస్సు -2019కు హాజరైన డెలిగేట్లు సందర్శించారు. శుక్రవారం గత మూడు రోజులుగా నగరంలో జరుగుతున్న ఆనంద నగరాల సదస్సుకు పాల్గొనేందుకు విచ్చేసిన దేశ, విదేశ ప్రతినిధులు సుమారు 60 మంది డెలిగేట్లు రెండు బస్సులతో అమరావతి నగరానికి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, డిజైన్లను చూపించారు. తొలుత అమరావతి నగరానికి సంబంధించిన త్రీడీ నమూనాలను వీక్షించిన వారు ఆయా డిజైన్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి రాయపూడిలో నిర్మితమవుతున్న ఏఐఎస్ అధికారుల నివాసాల సముదాయాన్ని పరిశీలించారు. అన్ని హంగులతో సిద్ధమైన మోడల్ ప్లాట్లను, హెచ్‌ఓడీ అండ్ సెక్రటేరియేట్, బంగ్లాలు, జ్యూడీషియల్ కాంప్లెక్సు, గజిటెడ్ అధికారుల నివాసాలు, విట్ యూనివర్శిటీ తదితరాలను పరిశీలించిన ప్రతినిధులకు ఆయా నిర్మాణాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వెలగపూడి సెక్రటేరియేట్‌లోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ (ఆర్టీజీఎస్) సెంటర్‌ను వీక్షించిన వారికి అధికారులు సెంటర్ పనితీరును వివరించారు.

వీఎంసీకి చేరిన బ్యాటరీ వాహనాలు
నేడు లాంఛనంగా ప్రారంభం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: పర్యావరణ పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే బ్యాటరీ వాహనాలు వీఎంసీకి అందుబాటులోకి వచ్చాయి. వీఎంసీకి కేటాయించిన 20 కార్లు శుక్రవారం వీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా, వాటిని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పరిశీలించారు. వీఎంసీలో పనిచేసే అన్ని విభాగాధిపతులకు వీటిని కేటాయించనున్నారు. ప్రస్తుతం నడుపుతున్న డీజిల్, పెట్రోల్ కార్లతో నిర్వహణ భారంతోపాటు నగర వాతావరణ కాలుష్యానికి తీవ్ర హాని కలిగిస్తున్న వైనంతో అతి తక్కువ ఇంధన ఖర్చుతో నడిచే ఈవాహనాలు పర్యావరణానికి అనుకూలమనే చెప్పాలి. ప్రస్తుతం కార్ల వినియోగానికి నెలకు 25వేల రూపాయలను చెల్లిస్తుండగా, వాటి స్థానంలో బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకురావడంతో నెలకు 5లక్షల రూపాయల చొప్పున సంవత్సరానికి 60లక్షలు వీఎంసీ ఖజానాకు ఆదా అవుతుంది. సుమారు 12లక్షల రూపాయల వ్యయం అయ్యే ఈవాహనాలు కిలోమీటరు దూరానికి కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. ఈ కార్లను పరిశీలించిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేసిన సూచనల మేరకు ఈ బ్యాటరీ కార్లను వినియోగంలోకి తెస్తున్నామన్నారు. దశల వారీగా వీఎంసీలో అద్దె వాహనాల స్థానంలో బ్యాటరీ కార్లను అందుబాటులోకి తెస్తామని, కార్ బ్యాటరీ చార్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విన్నూత్న ప్రయోగాలకు వేదికగా నిలిచే వీఎంసీ బ్యాటరీ కార్లను కూడా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. మేయర్ శ్రీ్ధర్‌తోపాటు ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, ఈఈ ఎఎస్‌ఎన్ ప్రసాద్, కార్పొరేటర్లు జీ మహేష్, కె వెంకటేశ్వరరావు, చందన సురేష్, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు, కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

స్వామికి ఘనంగా వైదిక కార్యక్రమాలు
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 15: పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు సందర్భంగా ఈవో హేమలతాదేవి సూచనతో అర్చకులు వైదిక కార్యక్రమాలను నిష్ఠతో నిర్వహించారు. ఉదయం అర్చకులు ఈవో హేమలతాదేవి దంపతులు, ఉభయదాతల సమక్షంలో శ్రద్ధతో భేరి పూజ, యజ్ఞశాల ప్రవేశం, వాస్తు పూజ, ధ్వజా రోహణ నిర్వహించారు. సాయంత్రం స్వామికి శేషవాహాన సేవ నిర్వహించారు. సాయంత్రం శ్రీవారి సన్నిధిలో సౌమ్య శిష్య బృందం వారిచేత శ్రీనివాస కల్యాణం నృత్య ప్రదర్శన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించింది. శుక్రవారం వేకువ జామున గోవింద భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీవారి ఊరేగింపు మహోత్సవాన్ని పాతబస్తీపురవీధుల్లో నిర్వహించారు.

ఉత్సాహంగా కురుక్షేత్ర..
విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 15: పరిశ్రమ ఏదైతే మేనేజ్‌మెంట్ విద్యార్ధుల నుండి ఆశిస్తుందో ఆ నైపుణ్యాన్ని విద్యార్థులు వృద్ధి చేసుకోవాలని సూర్య ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత వైవి కృష్ణమోహన్ అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల ఎంబీఎ విభాగం 25వ కురుక్షేత్ర వేడుకలు శుక్రవారం కళాశాల అడిటోరియంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణమోహన్ మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నూతన ఆలోచనలతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయావకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్ధులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే మానవ వనరులు, మార్కెటింగ్, గుత్త నిర్వహణలలో సృజనాత్మక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రమేష్, డైరెక్టర్ వి బాబురావు, డీన్ రాజేష్, రెహమాన్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్‌షోలు అందరినీ అలరించాయి.

కాంగ్రెస్ యాత్రకు అనుమతి కోరిన నేతలు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ ఈనెల 19నుంచి కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్రకు అనుమతివ్వాలని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ అనుమతిస్తూ సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల మేనిఫేస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రాజా డీజీపీ ని కలిసి ప్రజాయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్ వివరాలు తెలుపుతూ దరఖాస్తును అందించారు. మొత్తం 13రోజుల పాటు జరుగనున్న ఈ యాత్రలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొంటారని, 13 జిల్లాలలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 64 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో ఈ యాత్ర సాగుతుందని రుద్రరాజు వివరించారు.

కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు
పెనమలూరు, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలకునే అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులు పెట్టుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. మండల కేంద్రమైన పెనమలూరు సెంటర్‌లోని ఇందిరాగాంధీ ప్రాంగణంలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహనరావు ఆధ్వర్యంలో 16 నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలను ఆశించే అభ్యర్థుల అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ టిక్కెట్‌తో పాటుగా పార్టీని నియోజకర్గ స్థాయిలో గ్రామ గ్రామాల్లో బలోపేతం చేయాలన్నారు. దరఖాస్తు పెట్టుకున్న వారు తప్పనిసరిగా శక్తి ప్రాజెక్ట్, ఇంటింటికీ కాంగ్రెస్, ప్రతి మండల కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించడం, ప్రత్యేక హోదాపై పీసీసీ పార్టీ చేయబోయే బస్సు భరోసా యాత్రను నియోజకవర్గస్థాయిలో జయప్రదం చేయాలని ఆయన సూచించారు. జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహనరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారెవరైనా కలసికట్టుగా పని చేసి పార్టీ గెలుపునకు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ అద్యక్షుడు వీ గురునాథం, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ప్రధాన కార్యదర్శులు మీసాల రాజేశ్వరరావు, ఆర్‌టీఏ మాజీ కమిషనర్ రాం తాంతియా కుమారి, పీసీసీ కార్యదర్శి గొల్లుకృష్ణ, మెవ్వా మోహనరావు, శక్తిప్రాజెక్ట్ వెలిసెల సుబ్రహ్మణ్యం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్, పల్లనవీన్, కిలారు వెంకటరత్నం పాల్గొన్నారు.

గంపగుత్తగా ప్రకటనలు, విడతల వారీగా పనులు
వామపక్షాల నేతలు మధు, నాగేశ్వరరావు ఎద్దేవా
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం తన పదవీకాలం ముగుస్తున్న తరుణంలో అట్టహాసంగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాలను సత్వర అమలుచేయకుండా విడతల వారీ అమలు చేస్తాననడం సంక్షేమ లబ్ధిదారులను మరోసారి మోసం, ద్రో హం చేయడమేనని సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి పీ మధు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులు ఎద్దేవా చేశారు. శుక్రవారం నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేం ద్రంలో జరిగిన విలేఖరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్న తరుణంలో ప్రభు త్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు సక్రమ అమలవుతాయో లేదాన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కోడ్ రాక ముందే పథకా ల నగదు బదిలీని ఒకేసారి చేయాలని డిమాండ్ చేసిన వారు అలా చేయకపో తే ఈ పథకాలన్నీ కేవలం ఓట్లు పొందడానికే ప్రకటించిన పథకాలుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఖరీఫ్‌లో 348 కరువు మండలాలుగా ప్రకటించగా, ప్రస్తుత రబీలో 257 మండలాలుగానే ప్రకటించడంతో రైతులు పెట్టుబడి న ష్టపోయారని, ఒక్క అనంతపురం జి ల్లాలోనే వేరుశనగ రైతులు, ఎకరానికి 25వేల చొప్పున 937 కోట్లు నష్టపోయారన్నారు. రైతలను ఆదుకోవడానికి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద కేంద్రం 6వేలు, రాష్ట్ర ప్రభుత్వం 4వేలు కలిపి మొత్తం 10వేలను ఒకే విడతలో చెల్లించాలన్నారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పంట పెట్టుబడికి 25వేల వరకు పెంచాలన్నారు. అలాగే గతంలో రాష్ట్రం ప్రకటించిన దశల వారీ రుణమాఫీలో 3 విడతలు మాత్రమే చెల్లించగా, మిగిలిన 4,5 విడతల చెల్లింపులు జరగలేదన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద చెల్లిస్తానన్న 10వేల పోస్టు డేటెడ్ చెక్కులు కాకుండా ఒకేసారి చెల్లించడమే కాకుండా మహిళలకు ఇస్తానన్న స్మార్ట్ ఫోన్‌లను కూడా వెంటనే ఇవ్వాలన్నారు. ఇదిలావుండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లిస్తున్నట్టు వెలువడుతున్న వార్తల నేపథ్యంలో అటువంటి అనైతిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

వీఎంసీ ఓపెన్ ఫోరం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం నిర్వహించిన ఓపెన్ ఫోరం కార్యక్రమంలో సుమారు 7దరఖాస్తులను పరిష్కరించారు. శుక్రవారం ఉదయం వీఎంసీ మెయిన్ ఆఫీస్‌లోని కౌన్సిల్ భవనంలోని స్టాండింగ్ కమిటీ హాల్లో జరిగిన ఈ ఓపెన్ ఫోరం లో టీడీఆర్ బాండ్లకు సంబంధించి 3, సైట్ అలామెంట్ -1, ప్లాన్ అప్రూవల్ -1, బీపీఎస్ విచారణ -1, మార్టిగేజ్ రి లీజ్ -1 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. ఈకార్యక్రమంలో సీటీ ప్లానర్ ఏ లక్ష్మణరావు పాల్గొన్నారు.