విజయవాడ

కౌలు రైతులకే పెట్టుబడి సాయం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పెట్టుబడి సాయం వాస్తవ సాగుదారులైన కౌలురైతులకే ఇవ్వాలని కోరుతూ ఏపీ కౌలురైతు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కౌలురైతులంతా దరఖాస్తులు తీసుకుని ఫిబ్రవరి 25న తహశీల్దార్ కార్యాలయాలకు సామూహిక రాయబారం నిర్వహించాలని శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు కోరారు. ఏపీ కౌలురైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పీ జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎస్ ప్రసాద్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ పెద్దిరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో 50 శాతం రాష్ట్రంలో 80 శాతం కౌలురైతులే పంటలు పండిస్తున్నారని, ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు పండిస్తూ సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారన్నారు. సామాజికంగా పరిశీలించినప్పుడు వీరంతా బడుగు బలహీన వర్గాల వారని, పైగా భూమిలేని పేదలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో పాటు కాకుండా ఖరీఫ్‌లో కౌలురైతులకు ఇస్తామని అనటం వాస్తవంగా పంటలను పండించే కౌలురైతులను అవమానించటమే అవుతుందని వారు నిరసన తెలిపారు.

టీచర్ల బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 16: ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 46వ కేబీఎస్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కళాశాలల లెక్చరర్ల బ్యాడ్‌మింటన్ టోర్నమెంట్ శనివారం స్థానిక దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సబ్ కలెక్టర్ మిషాసింగ్, శాప్ చైర్మన్ డా. పీ అంకమ్మచౌదరి పాల్గొని పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ని ర్మించిన ఇండోర్ స్టేడియాన్ని మిషాసిం గ్, అంకమ్మచౌదరి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో సింగిల్స్ విభాగం లో 91 ఎంట్రీలు, డబుల్స్ విభాగంలో 21 ఎంట్రీలు వచ్చాయి. ఆదివారంతో టోర్నమెంట్ ముగియనుంది. ప్రారం భ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ ప్రతినిధి కేసీహెచ్ పున్నయ్యచౌదరి, కార్పొరేటర్ కంచర్ల నాగవెంకట శేషారాణి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు జానయ్య, కార్యదర్శి చిగురుపాటి యుగంధర్, కళాశాలల వ్యాయామ వి ద్యాసంచాలకులు పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు పూర్వవిద్యార్థుల సంఘంతో పాటు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, జాకీర్‌హుస్సేన్, రెయిన్‌బో కలర్ లాబ్ అధినేత ప్రభాకర్ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయ సహకారాలు అందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. వెలగా జోషి తెలిపారు.

నగరానికి అరుదైన అతిథి!
మన రాజధాని నగరానికి అరుదైన అతిథి అరుదెంచింది. మన ప్రాంతానికి చెందని ఓ పక్షి సబ్ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఓ మొక్కపై పూలతో సరాగాలాడుతూ కనిపించింది. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ పక్షిని ‘హార్న్‌బిల్’గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. హార్న్‌బిల్ జాతి కుటుంబానికి చెందిన ఈ పక్షి ఆసియా, ఆఫ్రికా ప్రాంత అడవుల్లో నివసిస్తుంటుందని, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చలి ప్రదేశాలను వెతుక్కుంటూ వలస వస్తూ ఉంటుందని తెలుస్తోంది. ఈ దూరప్రాంత అతిథి శనివారం ‘్భమి’ కెమెరా కంటికి చిక్కిందిలా..!