విజయవాడ

జనసేన టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 16: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు ఆరాటపడుతున్నారు. జనసేన అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు విద్యావంతులు, వృత్తి నిపుణలు, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న స్క్రీనింగ్ కమిటీకి శనివారం బయోడేటాలు అందించేందుకు వరసకట్టారు. శనివారం ఒక్కరోజే 265 బయోడేటాలు వచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీ ముఖ్యనేత, ఉమ్మడి రాష్ట్రాల మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి అభ్యర్థిత్వం కోరుతూ స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటాను శనివారం అందించారు. పార్టీ నిర్దేశించిన నమూనాను నింపి అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సూచించిన నియమావళిని అనుసరిస్తూ అభ్యర్థులు బయోడేటాలు అందిస్తున్నారని చెప్పారు. పవన్ ఎంత క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేస్తున్నారో అదేవింధంగా నాయకులు, జనసైనికులు పని చేస్తున్నారని తెలిపారు. ఐదుగురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మాదాసు గంగాధరం నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ పెద్ద ఎత్తున బయోడేటాలను స్వీకరించింది. కమిటీ ముందుకు శనివారం బయోడేటా ఇచ్చేందుకు వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రజాక్షేత్రంలో ఉన్న వారు ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు, వైద్యులు, సీఎస్‌లు, ప్రవాసాంధ్రులు కూడా ఉన్నారు. పలు సామాజిక పోరాటాల్లో పాలుపంచుకున్న పలువురు మహిళలు బయోడేటాను అందించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు హరిప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాలను కోరుతూ ఆశావాహులు బయోడేటాలు అందిస్తున్నట్లు చెప్పారు. పవన్‌పై బలమైన విశ్వాసం ఉన్నందునే బయోడేటాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయన్నారు. రేపు ఆదివారం అయినప్పటికీ బయోడేటాలు స్వీకరించనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పథకాలతో పేదల అభ్యున్నతి
*మేయర్ కోనేరు శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 16: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల సద్వినియోగంతో పేద, అల్పాదాయ వర్గాలు అభ్యున్నతి చెందుతున్నారని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జక్కంపూడి కాలనీలో పక్కాగృహ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీలో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి నెలకు కనీస ఆదాయం సమకూర్చాలన్న లక్ష్యంతోపాటు ఉపాధి అవకాశాలతోపాటు విద్య, వైద్యం, వౌలిక సదుపాయాల కల్పనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రిజిస్ట్రేషన్ పట్టాలతో పేదలకు ఎంతో ఆర్థిక ప్రయోజనాలకు దోహదపడుతుందన్నారు. ఈకార్యక్రమంలో గొల్లపూడి మాజీ అధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు, హౌసింగ్ ఈఈ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.